AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది

పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది

Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jan 26, 2026 | 5:59 PM

Share

AIG హాస్పిటల్స్ డైరెక్టర్, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. గూడూరు వెంకట్‌రావు (డా. జీవీ రావు)కు 2026 పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇది తెలంగాణ వైద్య రంగానికి గర్వకారణం. 12,000 శస్త్రచికిత్సలు, 16,000 ఎండోస్కోపీలతో పాటు, ట్రాన్సోరల్ ఎండోస్కోపిక్ అపెండెక్టమీ వంటి అధునాతన పద్ధతులను దేశంలోనే ప్రవేశపెట్టారు. ఈ పురస్కారం తనకు మరింత బాధ్యతను పెంచిందని డా. జీవీ రావు పేర్కొన్నారు.

AIG హాస్పిటల్స్ డైరెక్టర్, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. గూడూరు వెంకట్‌రావు (డా. జీవీ రావు)కు 2026 పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇది తెలంగాణ వైద్య రంగానికి గర్వకారణం. 12,000 శస్త్రచికిత్సలు, 16,000 ఎండోస్కోపీలతో పాటు, ట్రాన్సోరల్ ఎండోస్కోపిక్ అపెండెక్టమీ వంటి అధునాతన పద్ధతులను దేశంలోనే ప్రవేశపెట్టారు. ఈ పురస్కారం తనకు మరింత బాధ్యతను పెంచిందని డా. జీవీ రావు పేర్కొన్నారు. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, AIG హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ గూడూరు వెంకట్‌రావు (డా. జీవీ రావు) గారికి 2026 పద్మశ్రీ పురస్కారం లభించడం తెలంగాణ వైద్య రంగానికి గర్వకారణంగా నిలిచింది. వైద్య రంగంలో విశిష్ట సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ గౌరవంతో సత్కరించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణ నుంచి ఏడుగురికి పద్మశ్రీలు దక్కగా, డా. గూడూరు వెంకట్‌రావు ఆ జాబితాలో ప్రముఖ స్థానంలో ఉన్నారు.డా. జీవీ రావు దాదాపు 12,000కి పైగా శస్త్రచికిత్సలు, 16,000 ఎండోస్కోపీలు విజయవంతంగా నిర్వహించారు. ట్రాన్సోరల్ ఎండోస్కోపిక్ అపెండెక్టమీ వంటి అధునాతన పద్ధతులను భారతదేశంలో మొదటిసారిగా అమలు చేసిన వారిలో ఆయనే ముందుండి. మధుమేహులకు సంబంధించిన మాక్రో-ఎన్‌క్యాప్సులేషన్ డివైస్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. AIG హాస్పిటల్స్‌లో చీఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా, డైరెక్టర్‌గా ఆయన సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.ఈ అవార్డు గురించి మాట్లాడుతూ డా. గూడూరు వెంకట్‌రావు గారు భావోద్వేగంతో ఇలా అన్నారు: “పద్మశ్రీ అవార్డు రావడం నాకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని ఇచ్చింది. కానీ ఇది వ్యక్తిగత విజయం కాదు – నా సహోద్యోగులు, నర్సులు, టెక్నీషియన్లు, అడ్మినిస్ట్రేటర్లు, మరియు ముఖ్యంగా డా. డి. నాగేశ్వర్ రెడ్డి గారి మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ అవార్డు నాపై మరింత బాధ్యతను పెంచింది. ఇకపై మరింత మెరుగైన సేవలు అందించాలనే తపన పెరిగింది.”

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాంధీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. మహిళకు పునర్జన్మ

బాబోయ్‌ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు

‘ఆ అంకుల్స్ నాతో చండాలంగా ప్రవర్తించారు’ హీరోయిన్ ఎమోషనల్

‘పెళ్లికి ముందే అమ్మాయితో అసభ్యంగా దొరికాడు.. కోపంతో చితకొట్టిన క్రికెటర్’

రెడ్ కార్పరేట్ తో మాజీ మావోయిస్టు నేత కీ ఘన స్వాగతం.. పువ్వులు చల్లిన స్థానికులు

Published on: Jan 26, 2026 04:55 PM