ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా.. స్టార్ హీరోల చూపు మాత్రం అటువైపే
టాలీవుడ్‌లో ప్రస్తుతం మాస్ యాక్షన్ సినిమాల ప్రభంజనం నడుస్తోంది. కుటుంబ కథా చిత్రాలు విజయం సాధిస్తున్నప్పటికీ, ప్రభాస్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలందరూ రక్తపాతం, యాక్షన్ నిండిన కమర్షియల్ కథలకే మొగ్గు చూపుతున్నారు. ఇండస్ట్రీలో చిన్న హీరోల నుండి అగ్రతారల వరకు అందరూ మాస్ చిత్రాల వైపే అడుగులు వేస్తున్నారు. ఇది టాలీవుడ్ భవిష్యత్తు ధోరణిని సూచిస్తోంది.
ఓ వైపు ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా.. ఇండస్ట్రీ రికార్డులు కుమ్మేస్తున్నా హీరోల మనసు మాత్రం మాస్ వైపు.. రక్తపాతం వైపే అడుగులేస్తుంది. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా యాక్షన్ సినిమాలు కావాలని పట్టు పడుతున్నారు. మాస్ వైపే మొగ్గు చూపుతున్నారు. కమర్షియల్ కథల కోసమే రక్తం చిందిస్తున్నారు. అసలేం ఉంది ఈ మాస్ కథల్లో.. చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా..? చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్ తనను తాను మార్చుకుని పూర్తిగా ఎంటర్‌టైన్మెంట్ జోన్‌లోకి వెళ్లి చేసిన రాజా సాబ్ ఫలితం అందరికీ తెలిసిందే. అందుకే తనకి అలాంటివి వద్దని.. మళ్లీ మాస్ వైపే వస్తున్నారు రెబల్ స్టార్. నెక్ట్స్ చేయబోయే సినిమాలన్నీ ఊరమాస్ అండ్ పక్కా కమర్షియల్ కథలే. ఫ్యామిలీ కథతో హిట్ కొట్టిన చిరంజీవి సైతం నెక్ట్స్ మాసే కావాలంటున్నారు. శంకరవరప్రసాద్ గారు కుటుంబ ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో కలెక్షన్లే సాక్ష్యం. అంతటి హిట్ తర్వాత.. బాబీతో బెంగాల్ నేపథ్యంలో యాక్షన్ సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. అలాగే నారీనారీ నడుమ మురారితో హిట్ కొట్టిన శర్వా.. భోగి అంటూ సంపత్ నందితో కలిసి భారీ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. విజయ్ దేవరకొండకు గత ఐదేళ్లలో ఊరటనిచ్చిన సినిమా ఖుషీ. అది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. కానీ దాని తర్వాత వరసగా మాస్ సినిమాలే చేస్తున్నారు రౌడీ. ఫ్యామిలీ స్టార్ నిరాశపరచడంతో యాక్షనే బెస్ట్ అంటున్నారీయన. గతేడాది వచ్చిన కింగ్డమ్‌లో రక్తపాతానికి ఢోకా లేదు.. నెక్ట్స్ రాబోయే రౌడీ జనార్ధనతో పాటు రాహుల్ సంక్రీత్యన్‌తో చేస్తున్న VD14లోనూ ఫుల్ వయొలెన్స్ ఉండబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం దేవర, వార్ 2లో కావాల్సినంత రక్తపాతం సృష్టించారు.. నెక్ట్స్ ప్రశాంత్ నీల్ సినిమాలోనూ అదే కంటిన్యూ కానుంది. ఇక శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్‌తో చిన్నసైజ్ విధ్వంసమే సృష్టిస్తున్నారు. బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా సైతం పక్కా మాస్ యాంగిల్‌లోనే రెడీ అవుతుంది. ఎలా చూసుకున్నా నెక్ట్స్ అంతా ఇండస్ట్రీలో మాస్ ప్రభంజనమే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anil Ravipudi: అనిల్ రావిపూడి మాస్ ప్లానింగ్‌కు అందరూ ఫిదా
Samantha: ట్రెండింగ్ అవుతున్న సమంత.. అసలు కారణం ఇదే
Ustaad Bhagat Singh: ఉస్తాద్ డేట్ లాక్.. మెగా ఫ్యాన్స్‌కు షాక్
జనవరి నుంచి సమ్మర్ వరకు.. క్రేజీ సినిమాల జాతర
పద్మశ్రీ రావడం సంతోషం మాత్రమే కాదు.. మరింత బాధ్యతనూ పెంచింది
ఐఏఎస్, ఐపీఎస్ ఆదర్శ వివాహం ఆడంబరాలకు దూరం, యువతకు స్ఫూర్తి
బాబోయ్ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు
టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం
8వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ..
రేకుల ఇంట్లో రచ్చ రచ్చ.. తలుపు తీసి చూసిన పోలీసులకు షాక్
ఉదయం ఇంట్లోనుంచి బయటకు రాగానే.. భయానక దృశ్యం
ఆకాశంలో అద్భుత దృశ్యం.. వైరల్ అవుతున్న డ్రోన్ షో

