AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC govt Jobs 2026: డిగ్రీ పాసైన వారికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తు ఎలా చేయాలంటే?

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగ యువత గ్రూప్ 'ఏ', గ్రూప్ 'బి' గెజిటెడ్ ఉద్యోగాలను సొంతం చేసుకోవడానికి ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..

UPSC govt Jobs 2026: డిగ్రీ పాసైన వారికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తు ఎలా చేయాలంటే?
UPSC Group A and B Gazetted Recruitment
Srilakshmi C
|

Updated on: May 26, 2026 | 6:53 AM

Share

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బి’ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 12 విభాగాల్లో మొత్తం 194 పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత కలిగిన వారు ముగింపు గడువులోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

యూపీఎస్సీ గ్రూప్ ‘ఏ’ గ్రూప్ ‘బి’ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు

  • ఎయిర్‌వర్దినెస్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 25
  • డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ పోస్టుల సంఖ్య: 44
  • మేనేజర్ – మెయిల్ మోటార్ సర్వీస్ పోస్టుల సంఖ్య: 08
  • జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 5
  • జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ – కెమికల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 1
  • సైంటిఫిక్ ఆఫీసర్ – మెకానికల్ పోస్టుల సంఖ్య: 2
  • అసోసియేట్ ప్రొఫెసర్ – ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 1
  • సైంటిస్ట్-బి – అట్మాస్ఫియరిక్ సైన్సెస్ పోస్టుల సంఖ్య: 7
  • సైంటిస్ట్-బి – జనరల్ మెటియోరాలజీ పోస్టుల సంఖ్య: 30
  • జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్ – పోలీస్ వైర్‌లెస్ పోస్టుల సంఖ్య: 6
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ – గ్రౌండ్ వాటర్ పోస్టుల సంఖ్య: 2
  • డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజినీర్ పోస్టుల సంఖ్య: 4

ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ (బీఈ లేదా బీటెక్‌), పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. టెక్నికల్‌, మేనేజ్మెంట్ పోస్టులకు విద్యార్హతలతో పాటు 1 నుంచి 3 ఏళ్ల వరకు సంబంధిత రంగంలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ వంటి ఉన్నత పోస్టులకు 45 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంటుంది. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు (PwBD) అభ్యర్ధులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 12, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 25 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులందరికీ ఎలాంటి ఫీజు లేదు. స్క్రీనింగ్/షార్ట్‌లిస్టింగ్‌ చేసి.. వచ్చిన దరఖాస్తులను బట్టి రిక్రూట్‌మెంట్ టెస్ట్ లేదా కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. మెరిట్‌ అభ్యర్ధులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ గ్రూప్ ‘ఏ’ గ్రూప్ ‘బి’ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us