వరంగల్ జిల్లాలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని పాము కాటువేయగా, అతను ఆ పామును బాటిల్లో బంధించి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్ళాడు. వైద్యులు సరైన వైద్యం అందిస్తారని ఆశించాడు. అది విషపు పాము కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్న బాధితుడు, ఆ తర్వాత పామును సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు.