- Telugu News Photo Gallery Spiritual photos These are the rules that must be followed on Akshaya Tritiya
అక్షయతృతీయ రోజు తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే!
అక్షయ తృతీయ వచ్చేసింది. ఇది చాలా విశేషమైన రోజు. ఈ రోజుకు చాలా విషిష్టత ఉంటుంది. నేడు లక్ష్మీ దేవిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు.ఎలాంటి సమస్యలు లేకుండా ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా సిరిసంపదలతో తులతూగాలని లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాంటి ఈ గొప్ప పర్వదినాన తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంట. లేకపోతే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అంటున్నారు పండితులు. కాగా అసలు అక్షయతృతీయ రోజున ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
Updated on: Apr 30, 2025 | 8:15 AM

ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో శుక్లపక్షం తదియా రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం.2025లో అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదినా ప్రజలందరూ జరుపుకోనున్నారు. సంపదలకు రక్షకుడిగా కుబేరుడిని నియమించే రోజును అక్షయతృతీయగా చెబుతారు.

ఇక అక్షయ తృతీయ శ్రీమహావిష్ణువుకు, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మముహుర్తంలోనే నిద్రలేచి, ఇంటిని శుభ్రం చేసుకొని, దీపారాధన చేయాలి అంటారు. లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందంట.

ఈరోజున ఎట్టిపరిస్థితుల్లో ఉల్లిగడ్డ, వెల్లిల్లుపాయలతో కూడిన ఆహారాన్ని వండటం కానీ, తినడం కానీ చేయకూడదు. ముఖ్యంగా ఈరోజు ఇల్లును చాలా శుభ్రంగా ఉంచాలి. అంతే కాకుండా ఈరోజున శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన తులసి మొక్క ఆకులను తుంచకూడదంట.

అక్షయతృతీయ రోజున ఉదయాన్నే లేచి లక్ష్మీదేవిని నిష్టగా పూజించాలంట. అంతే కాకుండా ఈరోజు మహిళలు పసుపు,కుంకుమ, పూలతో అలంకరించుకొని, ఇంటిలో పూజా కార్యక్రమాలు చేపట్టాలంట. దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతే కాకుండా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదంటున్నారు పండితులు.

ఒక వేళ ఈరోజు మాంసాహారం తిన్నా, ఇంట్లో వండుకున్నా కూడా దరిద్రం రావడమే కాకుండా, ఈ అలవాట్లు పేదరికాన్ని తీసుకొస్తాయంట. అలాగే ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేసిన వారు అససలే వాటిని అలంకరించుకోకూండ పూజించిన తర్వాత పెద్దల చేతుల మీదగా తీసుకొని అలంకరించుకోవాలంట.



