- Telugu News Photo Gallery Spiritual photos Kudavelli Lord Shiva Temple has a history dating back to the Ramayana period
Kudavelli: కూడవెల్లి రామలింగేశ్వర ఆలయం.. రామాయణంతో లింక్.. ఏంటది.?
అనేక చారిత్రక ఘట్టాలకు నెలవు ఈ భారతదేశం. త్రేతయోగంలో శ్రీరాముడు పాలించిన ఈ పుణ్యభూమి ఎన్నో ప్రసిద్ధ ఆలయాలను కలిగి ఉంది. అలంటి వాటిలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన కూడవెళ్లి ఆలయం ఒకటి. ఇక్కడ ప్రతీ ఏడాది మాఘ మాసంలో అత్యంత వైభవంగా జాతర జారుతుంది. శ్రీరామచంద్రుడు ఇసుకతో చేసి ప్రతిష్టించిన శివలంగం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఈ ఆలయనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. అదేంటో తెలుసుకుందాం..
Updated on: Apr 30, 2025 | 8:40 AM

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో భూంపల్లి మండలం దుబ్బాక చేరువలో ఉన్న రామేశ్వరం పల్లి గ్రామంలో ఇసుక లింగ ఆలయం ఉంది. ఈ క్షేత్రన్నీ దక్షిణ కాశీగా రాష్ట్రంలోని భక్తులు పిలుస్తారు. ఈ గుడి చరిత్ర చాలానే ఉంది.

ఈ క్షేత్ర చరిత్ర విషయానికి వస్తే.. శ్రీరామడు రావణ సంహారం తర్వాత అగస్త్య మహాముని సూచనతో బ్రహ్మహత్య మహాపాపం దోషాన్ని నిర్మూలన కోసం శివుణ్ణి పూజించదలచి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడినికి చెప్పగా.. ఆయన రావడం ఆలస్యం కావడంతో ఇసుక లింగాన్ని చేసి పూజ చేసిన వృత్తాంతం మనకి తెలిసిందే.

శ్రీరాముడే కూడవెల్లి వాగు వద్ద ఇసుకతో చేసిన సైకత లింగాన్ని ప్రతిష్టి పూజ చేస్తున్న సమయంలో హనుమంతుడు లింగాన్ని తీసుకొస్తాడు. అక్కడ మరో లింగాన్ని చూసిన మారుతి దిగులుతో ఉండగా.. రఘునాథుడు వాయుపుత్రినితో 'బాధపడకు హనుమ, మొదట నీవు తెచ్చిన లింగానికి పూజలు చేసినాక, నేను ప్రతిష్టించిన సైకత లింగాన్ని పూజిస్తారు' అని వరం ఇస్తాడు. ఈ ఆలయంలో రెండు లింగాలు దర్శనమిస్తాయి.

రెండు వాగులు కలిసే ప్రదేశంలో ఈ ఆలయ నిర్మణం జరిగింది. అన్ని వాగులు పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తుంటాయి. కూడవెళ్లి క్షేత్రంలో వ్యతిరేక దశలో ప్రవహిస్తుంది. ఇది ఇక్కడ మరో ప్రత్యేకత. కూడవెళ్లి పార్వతి సంగమేశ్వర ఆలయం, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం, వినాయకుని ఆలయాలను దర్శించుకోవచ్చు.

ఈ క్షేత్రనికి చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి సిద్ధిపేట చేరుకొని వెళ్ళవచ్చుడు. అలాగే హైదరాబాద్ నుంచి రామాయంపేట మీదగాకూడా ఈ ఆలయానికి వెళ్ళవచ్చు. ఈ క్షేత్రం హైదరాబాద్ నుంచి సుమారు 100 కి.మీ. దూరంలో ఉంది. సిద్ధిపేట నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఇక్కడికి వెళ్ళవచ్చు.




