AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయ తృతీయ స్పెషల్ కొబ్బరి పాయసం.. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసే రెసిపీ

అక్షయ తృతీయ పర్వదినం సంపద, శుభం, శాంతి కలిగించే పుణ్యదినంగా పరిగణించబడుతుంది. ఈ రోజున లక్ష్మీ దేవి, విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించడం శ్రేయస్కరం. అక్షయ తృతీయ నాడు చేసిన పూజలు, సమర్పించిన నైవేద్యాలు దేవతల ఆశీర్వాదాన్ని పొందటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. మీరు ఈ రోజున ఇంట్లో నారియల్ ఖీర్ (కొబ్బరి పాయసం) తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు.

అక్షయ తృతీయ స్పెషల్ కొబ్బరి పాయసం.. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసే రెసిపీ
Akshaya Tritiya Sweet Recipe
Prashanthi V
| Edited By: Ram Naramaneni|

Updated on: Apr 30, 2025 | 8:07 AM

Share

కొబ్బరి పాయసం రుచి పరంగా ఎంతో మధురంగా ఉండటమే కాకుండా.. శరీరానికి ఆహారపదార్థంగా మంచి పోషకాలు కూడా అందిస్తుంది. ఈ వంటకం ప్రత్యేకంగా లక్ష్మీదేవికి నైవేద్యంగా ఎంతో శ్రేయస్కరంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఈ నైవేద్యాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు (నలుగురికి సరిపడా)

  • తాజా తురిమిన కొబ్బరి – 1 కప్పు
  • పాలు – 1 లీటరు
  • బాస్మతి బియ్యం – 1/4 కప్పు (కడిగి గంటపాటు మరిగించాలి)
  • చక్కెర – 1/2 కప్పు (తక్కువ లేదా ఎక్కువ అవసరాన్ని బట్టి)
  • యాలకుల పొడి – 1/2 టీ స్పూన్
  • కుంకుమపువ్వు – కొన్ని
  • నెయ్యి – 1 స్పూన్
  • కాజు, బాదం, ద్రాక్షపండ్లు – అలంకరణ కోసం

తయారీ విధానం

ముందుగా ఒక మందంగా ఉండే గిన్నె తీసుకొని అందులో పాలు పోసి వేడి చేయాలి. పాలు పొంగుతున్నప్పుడు, నానబెట్టిన బియ్యం వేసి మళ్లీ మరిగించాలి. అది ఉడుకుతున్నప్పుడు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే పాలు అడుగంటుతాయి. బియ్యం బాగా ఉడికిన తర్వాత, అందులో కొబ్బరి తురుము వేయాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద ఒక పది నిమిషాలు ఉడికించాలి. అప్పుడు కొబ్బరి రుచి పాలల్లో బాగా కలుస్తుంది.

ఇప్పుడు చక్కెర వేసి, అది కరిగే వరకు కలపాలి. తర్వాత యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలిపితే పాయసం మంచి వాసనతో, రుచిగా ఉంటుంది. చిన్న గిన్నెలో నెయ్యి వేడి చేసి, అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్ వేయించి పాయసంలో కలపాలి. ఇంతే సింపుల్.. కొబ్బరి పాయసం రెడీ అయ్యింది. ఈ తీపి వంటకం అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. తరువాత కుటుంబంతో కలిసి ప్రసాదంగా స్వీకరించండి.

ఈ నారియల్ ఖీర్ విశేషంగా లక్ష్మీదేవిని ప్రసన్నపరిచే నైవేద్యంగా చెబుతారు. తయారీ కూడా సులభంగా ఉండటంతో ఈ పండుగ రోజున మీరు తప్పకగా ఇది తయారు చేసి దైవకృపను పొందండి. ఇక మీరు తయారు చేసిన ఈ తీపి వంటకం ద్వారా అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో సిరిసంపదలు, ఆరోగ్యం, శాంతి, శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.