AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: మాజీ సీఎంగా విచారణకు సిద్ధం.. కానీ.. సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రియాక్షన్ ఇదే..

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్ నివాసంలో నోటీసులు అందించింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని సిట్ లేఖలో కోరింది. అయితే.. సిట్ నోటీసులపై కే. చంద్రశేఖర్ రావు స్పందించారు.

KCR: మాజీ సీఎంగా విచారణకు సిద్ధం.. కానీ.. సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రియాక్షన్ ఇదే..
BRS Chief KCR
Shaik Madar Saheb
|

Updated on: Jan 29, 2026 | 8:38 PM

Share

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్ నివాసంలో నోటీసులు అందించింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని సిట్ లేఖలో కోరింది. అయితే.. సిట్ నోటీసులపై కేసీఆర్ స్పందించారు. శుక్రవారం సిట్ విచారణకు హాజరుకాలేనని.. విచారణ వాయిదా వేయాలని కేసీఆర్ సిట్‌ను కోరారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా వాయిదా వేయాలని కోరారు. అయితే.. తనను ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారించాలని కేసీఆర్ కోరారు. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత విచారణ జరపాలని కేసీఆర్ కోరారు. మాజీ సీఎంగా విచారణకు సహకరించేందుకు సిద్ధమన్న కేసీఆర్.. బాధ్యతగల పౌరుడిగా విచారణకు సహకరిస్తా అంటూ సిట్ కు రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.. ఇకపై ఎలాంటి నోటీసులైన ఫామ్‌హౌస్ లోనే ఇవ్వాలని.. పేర్కొన్నారు. దీనిపై సిట్ స్పందించాల్సి ఉంది..

మరోవైపు కేసీఆర్‌కు సిట్ నోటీసులను బీఆర్ఎస్ ఖండించింది. కేసీఆర్‌కు నోటీసులివ్వడం దుర్మార్గమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది విచారణ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతీకారం అన్నారు. నోటీసులు, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరన్నారు.

సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ సర్కార్ సిట్ నోటీసుల డ్రామా ఆడుతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. పరిపాలనా వైఫల్యాలు, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారన్నారు హరీష్‌ రావు. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి దివాళాకోరు చర్యలకు దిగుతోందన్నారు బీఆర్ఎస్ నేతలు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కేసీఆర్‌కు నోటీసుల వెనుక ఎలాంటి దురుద్దేశం గానీ, రాజకీయ కక్ష గానీ లేదన్నారు.

ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను కేసీఆర్ కాపాడితే.. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను రేవంత్ కాపాడుతున్నారన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైలీ సీరియల్‌లా ఉందన్నారు BJP రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. కాంగ్రెస్ తమ వైఫల్యాలను కప్పించునేందుకే సిట్ దర్యాప్తులంటూ డ్రామాలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులివ్వడం తెలంగాణలో సంచలనంగా మారింది. విచారణలో సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. కేసీఆర్ ఏం చెబుతారన్నది టాక్‌ ఆఫ్ 2 STATE గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
ఫ్రీ ట్రయల్ ఉద్యోగమా? అభ్యర్థి షాకింగ్‌ రియాక్షన్ సంచలనం..!
ఫ్రీ ట్రయల్ ఉద్యోగమా? అభ్యర్థి షాకింగ్‌ రియాక్షన్ సంచలనం..!
సిట్ నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
సిట్ నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
అందులో ఏ మాత్రం నిజంలేదు.. ఆ ప్రచారంపై CP సజ్జనార్ క్లారిటీ!
అందులో ఏ మాత్రం నిజంలేదు.. ఆ ప్రచారంపై CP సజ్జనార్ క్లారిటీ!
మహిళల కంటే మగవాళ్లే ఎందుకు ఎక్కువ గురక పెడతారు..? అసలు రహస్యం..
మహిళల కంటే మగవాళ్లే ఎందుకు ఎక్కువ గురక పెడతారు..? అసలు రహస్యం..
తింటే తీపి.. ధర వింటే షాక్.. ఈ ఉప్పు ఎందుకంత స్పెషలో తెలుసా?
తింటే తీపి.. ధర వింటే షాక్.. ఈ ఉప్పు ఎందుకంత స్పెషలో తెలుసా?
తిరుమల శ్రీవారి సన్నిధిలో కొత్తం ఫోటో షూట్.. సీన్‌.. కట్‌చేస్తే!
తిరుమల శ్రీవారి సన్నిధిలో కొత్తం ఫోటో షూట్.. సీన్‌.. కట్‌చేస్తే!
పెంపుడు కుక్కపై ప్రేమతో 15లక్షలు ఖర్చుపెట్టిన కపుల్స్‌.. తెలిస్తే
పెంపుడు కుక్కపై ప్రేమతో 15లక్షలు ఖర్చుపెట్టిన కపుల్స్‌.. తెలిస్తే
వాళ్ల పేరిట కోట్ల ఆస్తులు.. ఈడీ దర్యాప్తుతో నయూం కేసులో...
వాళ్ల పేరిట కోట్ల ఆస్తులు.. ఈడీ దర్యాప్తుతో నయూం కేసులో...
పానీ పూరీ జాకెట్‌.. వేసుకోవాలి..? తినాలా..? ఇదేం వింత ఫ్యాషన్‌ రా
పానీ పూరీ జాకెట్‌.. వేసుకోవాలి..? తినాలా..? ఇదేం వింత ఫ్యాషన్‌ రా