Hyderabad: అందులో ఏ మాత్రం నిజంలేదు.. ఆ ప్రచారంపై CP సజ్జనార్ క్లారిటీ!
హైదరాబాద్ నగర వాసులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. బంగారం రేట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ఇలా సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయొద్దని పోలీసులు కోరుతున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న బంగారం రేట్లు నేపథ్యంలో నగరంలో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. జనాలు ఇలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
అలాగే సోషల్ మీడియా యాప్స్ అయిన వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వచ్చే ధృవీకరించని వార్తలను, భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయవద్దని అన్నారు. భయాందోళనలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితంగా ఉందని.. శాంతిభద్రతల పరిరక్షణలో మాకు సహకరించాలని కోరారు. ఏదైనా అనుమానం వస్తే డయల్ 100కు కాల్ చేయాలని స్పష్టం చేశారు. నగరవాసులు నిశ్చింతగా ఉండండాలని.. మీ భద్రతే మా బాధ్యతఅని ఆయన చెప్పుకొచ్చారు.
బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం.
దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను, భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయకండి.
భయాందోళనలు సృష్టించేలా… pic.twitter.com/fOmkk80ie7
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 29, 2026
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
