AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనంటే చిన్నప్పటి నుంచి పిచ్చి ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన సుప్రీత

సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలోకి రాకముందే ఈ చిన్నది సోషల్ మీడియాను షేక్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రిత. రెగ్యులర్ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. తల్లితో కలిసి పలు వీడియోలను షేర్ చేసింది ఈ భామ

అతనంటే చిన్నప్పటి నుంచి పిచ్చి ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన సుప్రీత
Supritha Naidu
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2026 | 5:16 PM

Share

ప్రముఖ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత ఇటీవలే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అమరావతికి ఆహ్వానం అనే సినిమాలో నటించింది. హారర్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సుప్రీత పలు ఇంటర్వ్యూల్లో ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే ఇటీవల ఇచ్చిన ఒక  ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యలు, కెరీర్ గురించి పంచుకుంది ఈ అందాల తార. సుప్రీత ఇటీవల ఎదుర్కొన్న తీవ్ర ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుతూ ఎమోష్నలైంది. అనవసరమైన బరువు తగ్గించుకునే ప్రయత్నంలో “వన్ మీల్” డైట్ పాటించి, సరైన ఫైబర్ తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన గ్యాస్ స్టేటస్ తో బాధపడ్డానని తెలిపింది సుప్రీత. పదిహేను రోజుల పాటు ఆసుపత్రిలో చేరి, నీరు తాగినా వాంతులు అవుతున్న పరిస్థితిలో తాను చావు అంచుల వరకు వెళ్లి వచ్చినట్టు అనిపించిందని తెలిపింది. ఈ అనుభవం తనను ఆధ్యాత్మికంగా మార్చిందని, దేవుడితో శాంతిని పొందుతున్నానని చెప్పుకొచ్చింది సుప్రీత.

ఇదేంది మావ..! రాధికా శరత్ కుమార్ చెల్లెలు కూడా హీరోయినా..!! బాలయ్యతో బ్లాక్ బస్టర్స్

సినిమా కెరీర్ విషయానికి వస్తే, సుప్రీత మంచి స్క్రిప్ట్‌లు లభిస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపింది. నటీనటులు కూర్చుని “ఎంత మంచి సినిమా, ఈ అమ్మాయి ఎంత బాగా చేసింది” అనిపించుకోవడమే తన లక్ష్యం అని తెలిపింది సుప్రీత. ఎన్టీఆర్ జూనియర్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలకు సిస్టర్ పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. అయితే, విజయ్ దేవరకొండ, అఖిల్ అక్కినేనిలకు మాత్రం సిస్టర్‌గా నటించనని సరదాగా చెప్పుకొచ్చింది. అఖిల్‌పై చిన్ననాటి అభిమానం ఉందని తెలిపింది. నాగార్జున గారిని కలిసినప్పుడు చాలా గొప్పగా మాట్లాడారని, అఖిల్ సినిమాల్లోకి రాకముందు సీసీఎల్‌లో ఆడేప్పటి నుంచే తనకు ఇష్టమని సుప్రీత తెలిపింది.

ఎలా రా ఇలా.! వైరల్ వీడియో పై సంయుక్త రియాక్షన్.. ఇంతకూ ఆ ఫొటోలో ఉంది ఎవరు.?

పవన్ కళ్యాణ్, విరాట్ కోహ్లీలను కలిస్తే తన గుండె ఆగిపోతుందేమోనని సరదాగా తెలిపింది. తన శరీరంలో మొత్తం ఏడు టాటూలు ఉన్నాయని సుప్రీత చెప్పుకొచ్చింది. వాటిలో తల్లిదండ్రుల కోసం, సన్ సెట్, ఓం, తండ్రి మరణించిన తేదీ, కర్మ, రోజ్, ఈవిల్ ఐ వంటివి ఉన్నాయి. తన తల్లి వెంకటేశ్వర స్వామి పాదాలను టాటూగా వేయించుకున్నారని కూడా చెప్పుకొచ్చింది సుప్రీత. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా