వామ్మో.. మల్లెపూలలో ఇంత మ్యాటర్ ఉందా..?

Samatha

19 February 2026

మల్లెపూలు ఇష్టం ఉండని వారు ఎవరుంటారు చెప్పండి. మహిళల మనసుదోచే పూలలో ఇవే ముందు ఉంటాయి.

మల్లెపూలంటే ఇష్టం

అయితే చాలా మంది మల్లెపూలు కేవలం సువాసన, ఇంటిలో పెట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి అనుకుంటారు. కానీ మల్లెపూలతో బోలెడు లాభాలు ఉంటాయంట. అవి ఏవో చూద్దాం.

మల్లెపూలతో లాభాలు

తాజాగా మల్లెలను మెత్తగా నూరి , చల్లటి కాటన్ క్లాత్‌లో చుట్టి, కళ్ల మీద పెట్టుకోవడం వలన కంటి సమస్యలు దూరం అవుతాయి.

కంటి సమస్యలు దూరం

డిప్రెషన్‌తో బాధపడే వారికి కూడా ఇది చాలా బెస్ట్. రాత్రి సమయంలో అతి కోపం, నిద్రలేమి సమస్యలతో బాధపడే వారు దిండు పక్కన మల్లెపూలు పెట్టుకోవడం వలన త్వరగా నిద్రపడుతుందంట.

డిప్రెషన్ 

అదే విధంగా  డయాబెటీస్ సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది చాలా బెస్ట్ అని చెప్పవచ్చును. మధుమేహం ఉన్నవారు, మల్లెపూలతో తయారీ చేసిన టీ తాగడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

డయాబెటీస్

అదే విధంగా జుట్టు రాలడం, అధిక చుండ్రుతో బాధపడే వారు మల్లెపూలతో పేస్ట్ తయారు చేసి దానిని కనీసం వారానికి ఒకసారి తలకు పెట్టడం వలన జుట్టు సమస్యలు తగ్గుతాయి.

జుట్టు సమస్యలు

నొప్పులు, కీళ్ల నొప్పులు, కళ్ల మంట వంటి సమస్యలతో బాధపడే వారు మల్లెపూల ఆకులతో కషాయం తయారు చేసుకొని, దానిని కొబ్బరి నూనెలో కలిపి మర్దన చేయడం వలన నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కీళ్ల నొప్పులు

అంతే కాకుండా మల్లెపూల వాసన ప్రతి రోజూ పీల్చడం వలన మానసిక ప్రశాంతత నెలకొంటుంది. ఇంటిలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది.

మానసిక ప్రశాంతత