RRC Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 5,349 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
RRC Western Railway Apprentice Recruitment 2026: వెస్ట్రన్ రైల్వే పరిధిలో 2025-26 సంవత్సరానికి డివిజన్, వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) వెస్ట్రన్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 5,349 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది..

భారత రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన వెస్ట్రన్ రైల్వే పరిధిలో 2025-26 సంవత్సరానికి డివిజన్, వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) వెస్ట్రన్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 5,349 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్ శిక్షణ పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో రైల్వే లెవల్ 1 ఉద్యోగాల్లో 20 శాతం వరకు వెయిటేజీ ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 23, 2026వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..
ఆర్ఆర్‌సీ వెస్ట్రన్ రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
విభాగాల వారీగా అప్రెంటిస్ ఖాళీల వివరాలు..
- ఫిట్టర్ విభాగంలో ఖాళీలు: 1614
- ఎలక్ట్రీషియన్ విభాగంలో ఖాళీలు: 1217
- వెల్డర్ విభాగంలో ఖాళీలు: 532
- పీఏఎస్‌ఏఏ విభాగంలో ఖాళీలు: 280
- ఎలక్ట్రానిక్ మెకానిక్ విభాగంలో ఖాళీలు: 236
- మెకానిక్ (డీజిల్) విభాగంలో ఖాళీలు: 207
- పెయింటర్ విభాగంలో ఖాళీలు: 190
- కార్పెంటర్ విభాగంలో ఖాళీలు: 184
- రిఫ్రిజిరేటర్ (AC-మెకానిక్) విభాగంలో ఖాళీలు: 184
- పైప్ ఫిట్టర్ విభాగంలో ఖాళీలు: 176
- ప్లంబర్ విభాగంలో ఖాళీలు: 136
- వైర్‌మ్యాన్ విభాగంలో ఖాళీలు: 126
- డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) విభాగంలో ఖాళీలు: 87
- టర్నర్ విభాగంలో ఖాళీలు: 75
- స్టెనోగ్రాఫర్ విభాగంలో ఖాళీలు: 40
- మెషినిస్ట్ (గ్రైండర్) విభాగంలో ఖాళీలు: 25
- ఫోర్జర్ & హీట్ ట్రీటర్ విభాగంలో ఖాళీలు: 16
- మెషినిస్ట్ విభాగంలో ఖాళీలు: 14
- మెకానిక్ మోటార్ వెహికల్ విభాగంలో ఖాళీలు: 10
ఆర్ఆర్‌సీ వెస్ట్రన్ రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్ధులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐలో కూడా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి మార్చి 23, 2026వ తేదీ నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్రెంటీస్ శిక్షణ ఏడాది పాటు ఉంటుంది. శిక్షణ సమయంలో ప్రతి నెలా నిబంధనల మేరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఈ అర్హలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 21, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 23, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ఆర్ఆర్‌సీ వెస్ట్రన్ రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




