సర్వం AI.. ముంచేస్తుందా..? తేలుస్తుందా..?
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సినిమా రంగంలో విప్లవం సృష్టిస్తోంది. బడ్జెట్ తగ్గింపు, సమయం ఆదా చేస్తూ చిన్న సినిమాలకు వరంలా మారింది. అయితే, భావోద్వేగ లోతు, నటన వంటి విషయాల్లో AI పరిమితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిని ఎలా ఉపయోగిస్తారన్నదే ముఖ్యం. AI వల్ల మేకింగ్ సులువైంది కానీ, అసలు సినిమాల ప్రామాణికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
AI.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్.. సినిమా ఇండస్ట్రీని టెన్షన్ పెడుతున్న విషయం ఇది.. అలాగే సంతోషపెడుతున్న విషయం కూడా ఇదే. వాడుకున్నోడికి వాడుకున్నంత అంటుంటారు కదా.. AI విషయంలో జరుగుతుందిదే. మరి ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభావం పడబోతుంది..? రాబోయే రోజుల్లో AI ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా.. ఇక్కడ మీరు చూస్తున్న ట్రైలర్‌లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం కాదు.. అంతా మాయ.. AI మాయ. అక్కడ మనుషులెవరూ లేరు. కేవలం ప్రాంప్ట్‌లతో తీసిన సినిమా తప్ప. నటులు అవసరం లేదు, కాస్ట్యూమ్స్‌తో పనిలేదు, గ్రాఫిక్ డిజైనర్లు అక్కర్లేదు, బడ్జెట్ ఊసే లేదు.. కేవలం ప్రాంప్ట్‌తో సినిమాలను సృష్టిస్తుంది AI. తెలుగులోనూ ఈ మధ్య AI యూసేజ్ పెరిగిపోయింది. ఒకప్పుడు సినిమాలకు గ్రాఫిక్స్ ఎలాగైతే వాడుకున్నారో.. ఇప్పుడు AIను అలాగే వాడుకుంటున్నారు నిర్మాతలు. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వరంగా మారింది. సరిగ్గా వాడుకుంటే కొన్ని సీన్స్‌లో ఏది ఒరిజినల్ కూడా చెప్పలేని పరిస్థితి. ఈ మధ్య కొన్ని సినిమాలలో AIను చాలా పద్దతిగా వాడుకుంటున్నారు మేకర్స్. AI కరెక్టుగా వాడుకుంటే బడ్జెట్ కంట్రోల్ ఉంటుంది.. టైమ్ కంట్రోల్ ఉంటుంది. కాకపోతే ఎంత బాగా AI ఉన్నా.. ఎమోషనల్ డెప్త్ ఉన్న సీన్స్ అండ్ సిచ్చువేషన్స్‌లో AI వర్కవుట్ అవ్వదనేది రానా అభిప్రాయం. ఇదివరకు రోజుల్లో అయ్యే పని.. ఇప్పుడు గంటల్లో అయిపోతుంది కానీ AIను ఎలా వాడతాం అనేది కూడా ముఖ్యమే అంటున్నారు రానా. ఒక్కటైతే నిజం.. AI వచ్చాక మేకింగ్ సులువైంది. ఇదే సమయంలో తమ సినిమా AI కాదు.. ఒరిజినల్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దర్శక నిర్మాతలకి వస్తుంది. ఆ మధ్య వారణాసి టీజర్ AIలో చేసారంటే సీరియస్ అయ్యారు రాజమౌళి. అలాగే నిఖిల్ సైతం స్వయంభు మిగిలిన సినిమాల్లా తమది AI కాదని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ చాలా పరీక్షలే పెడుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
ఈ దేశం ప్రజలకు 'దోసకాయలు' మరింత ప్రియం..
ట్యాబ్‌లెట్ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

