Ear Piercing: వట్టి ఆచారమే అనుకుంటే పొరపాటే.. పిల్లలకు చెవులు కుట్టించడం వెనుక బిగ్ సీక్రెట్..
భారతీయ సంస్కృతిలో చెవులు కుట్టడం అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది ఒక గొప్ప వైద్య ప్రక్రియ. చాలా మంది అందం కోసమో, ఆచారం కోసమో ఈ తంతు చేస్తారని అనుకుంటారు. 'కర్ణవేద' అని పిలిచే ఈ ఆచారం వెనుక పిల్లల మేధస్సు, దృష్టి శక్తి జీర్ణక్రియను మెరుగుపరిచే రహస్యాలు ఉన్నాయని ఆయుర్వేదం ఆధునిక ఆక్యుప్రెషర్ శాస్త్రాలు చెబుతున్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం.

మన పూర్వీకులు ప్రవేశపెట్టిన షోడశ సంస్కారాలలో ‘కర్ణవేద’ (చెవులు కుట్టడం) అత్యంత కీలకమైనది. నేటి కాలంలో దీనిని కేవలం ఫ్యాషన్ లేదా నగలు వేసుకోవడానికే అనుకుంటారు. కానీ, ఒక చిన్న రంధ్రం వెనుక మానవ శరీరంలో కలిగే భారీ మార్పులు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
మెదడుకు ‘పవర్’ బూస్ట్!
శాస్త్రీయ విశ్లేషణ ప్రకారం, చెవి లోబ్‌పై ఉండే ఒక ప్రత్యేక బిందువు మెదడులోని ఎడమ కుడి భాగాలను కలిపే నరాలతో ముడిపడి ఉంటుంది. చెవి కుట్టినప్పుడు ఈ కేంద్రం ఉత్తేజితమై జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అందుకే చిన్నతనంలో చెవులు కుట్టించుకున్న పిల్లల్లో చురుకుదనం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
దృష్టి, వినికిడి మెరుగు!
ఆక్యుప్రెషర్ సిద్ధాంతం ప్రకారం, మనం చెవి కుట్టించే భాగం నేరుగా కంటి నరాలకు అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల దృష్టి లోపాలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, చెవి లోపలి నరాలు చురుగ్గా మారి వినికిడి సామర్థ్యం కూడా పెరుగుతుంది.
జీర్ణక్రియ ఊబకాయానికి చెక్!
చెవి అడుగు భాగంలో ‘హంగర్ పాయింట్’ ఉంటుంది. ఇది మన ఆకలిని నియంత్రిస్తుంది. కర్ణవేద సంస్కారం ద్వారా ఈ పాయింట్‌ను ప్రేరేపించడం వల్ల పిల్లల్లో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. భవిష్యత్తులో స్థూలకాయం (Obesity) వంటి సమస్యలు రాకుండా ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది.
మానసిక ఆరోగ్యం.. ఆయుర్వేద కోణం!
చిన్నతనంలో చెవులు కుట్టడం వల్ల హిస్టీరియా వంటి మానసిక రుగ్మతలు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఆయుర్వేదం వివరిస్తోంది. ఇది పిల్లల్లో ఉండే చిరాకును తగ్గించి, వారిని మానసికంగా స్థిరంగా ఉంచుతుంది. ఇక పురుషుల్లో వీర్య కణాల సంరక్షణకు, మహిళల్లో ఋతు క్రమ సమస్యల నివారణకు కూడా ఇది తోడ్పడుతుందని నమ్ముతారు.
సరైన వయస్సు ఏది?
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, పిల్లలకు 3 నుండి 5 సంవత్సరాల మధ్య చెవులు కుట్టించడం ఉత్తమం. ఈ వయస్సులో చర్మం మృదువుగా ఉండి నొప్పి తక్కువగా ఉంటుంది గాయాలు త్వరగా మానుతాయి.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.
