AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: రూ.లక్షకు రూ.45 వేల లాభం.. పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. బ్యాంకులను మించిన వడ్డీ..

బ్యాంకులకు దీటుగా.. ప్రభుత్వ భరోసాతో పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు లాభాల పంట పండిస్తోంది. కేవలం ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే చాలు.. ఎలాంటి కష్టం లేకుండా ఐదేళ్లలో దాదాపు రూ.45 వేల లాభాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. చక్రవడ్డీ మ్యాజిక్‌తో మీ పెట్టుబడిని సురక్షితంగా పెంచుకునే ఈ పథకం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

Post Office: రూ.లక్షకు రూ.45 వేల లాభం.. పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. బ్యాంకులను మించిన వడ్డీ..
మీరు మీ జీవిత భాగస్వామితో లేదా మరెవరితోనైనా కలిసి ఒక జాయింట్ ఖాతా తెరిచి, ఇద్దరూ కలిసి రూ.15 లక్షలు జమ చేస్తే, 7.4% వడ్డీ రేటుతో వార్షిక వడ్డీ రూ.1,11,000 అవుతుంది. ఈ మొత్తాన్ని 12 నెలలుగా విభజిస్తే, ప్రతి నెలా మీ ఖాతాలో రూ.9,250 జమ అవుతుంది. మరోవైపు మీరు కేవలం రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు సంవత్సరానికి రూ.66,600 వడ్డీ లభిస్తుంది.
Krishna S
|

Updated on: Feb 19, 2026 | 2:04 PM

Share

నేటి రోజుల్లో సంపాదన ఎంత ముఖ్యమో, ఆ సంపాదనను సురక్షితమైన చోట దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, ప్రైవేట్ బ్యాంకుల రిస్క్ వద్దు అనుకునే వారికి భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ పోస్ట్ ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ప్రభుత్వ హామీతో కూడిన లాభాలను కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఒక వరంగా మారింది. ముఖ్యంగా ఐదేళ్ల కాలపరిమితితో కూడిన ఈ ప్లాన్ ఇప్పుడు సామాన్యులను విపరీతంగా ఆకర్షిస్తోంది. బ్యాంకుల్లో మనం చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ తరహాలోనే ఈ పథకం పనిచేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి మీ పెట్టుబడికి నూటికి నూరు శాతం భద్రత ఉంటుంది. కనీసం రూ.1000తో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎటువంటి పరిమితి లేదు.

వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి

కాలపరిమితిని బట్టి పోస్ట్ ఆఫీస్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది:

  • 1 సంవత్సరం: 6.9శాతం వడ్డీ
  • 2 ఏళ్లు: 7.0శాతం వడ్డీ
  • 3 ఏళ్లు: 7.1శాతం వడ్డీ
  • 5 ఏళ్లు: 7.5శాతం వడ్డీ

చాలా ప్రముఖ బ్యాంకులు 5 ఏళ్ల కాలపరిమితిపై 6.5శాతం నుంచి 7శాతం లోపు మాత్రమే వడ్డీ ఇస్తుండగా పోస్ట్ ఆఫీస్ ఏకంగా 7.5శాతం వడ్డీని అందిస్తోంది.

కాంపౌండ్ వడ్డీతో డబుల్ లాభం

ఈ పథకంలో వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. ఆ వడ్డీని మీ అసలుకు కలిపి మళ్లీ వడ్డీ లెక్కిస్తారు. దీనివల్ల సాధారణ వడ్డీ కంటే మీకు ఎక్కువ లాభం చేకూరుతుంది. ఈ వడ్డీని మీరు ఏటా మీ సేవింగ్స్ అకౌంట్‌లో జమ చేసుకోవచ్చు లేదా మెచ్యూరిటీ వరకు అలాగే ఉంచి భారీ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు.

రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే..

మీరు ఒక లక్ష రూపాయలను 5 ఏళ్ల కాలపరిమితితో ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేశారనుకుందాం.

  • మీ పెట్టుబడి: రూ.1,00,000
  • వడ్డీ ఆదాయం: రూ.44,995
  • మొత్తం చేతికి వచ్చేది: రూ.1,44,995
  • అంటే దాదాపు సగం డబ్బు వడ్డీ రూపంలోనే అదనంగా అందుతుంది.

ముఖ్యమైన ప్రయోజనాలు

పన్ను మినహాయింపు: ఐదేళ్ల టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో చేసే పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

అందరికీ సమానం: ఈ పథకంలో సీనియర్ సిటిజన్లకు, యువకులకు అందరికీ ఒకే రకమైన వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

సులభమైన విధానం: మీ సమీపంలోని ఏ పోస్ట్ ఆఫీస్‌కైనా వెళ్లి ఈ ఖాతాను వెంటనే ప్రారంభించవచ్చు.

Follow Us