AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Inter Exams 2026: తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్‌డేట్.. మార్చి 2026లో జరగనున్న వార్షిక పరీక్షలకు సంబంధించి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హాల్ టికెట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ హాల్ టికెట్లను పొందేందుకు..

TG Inter Exams 2026: తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్‌ ఇదే
Telangana Inter Hall Ticket 2026
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Feb 19, 2026 | 5:06 PM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్‌డేట్.. మార్చి 2026లో జరగనున్న వార్షిక పరీక్షలకు సంబంధించి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హాల్ టికెట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ హాల్ టికెట్లను పొందేందుకు బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్ బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం.. హాల్ టికెట్లను ఇప్పటికే ఆయా కాలేజీల లాగిన్‌లలో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించి హాల్ టికెట్లను సేకరించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది దాదాపు 9.9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు సకాలంలో హాల్ టికెట్లు తీసుకుని పరీక్షా కేంద్రాలను చూసుకోవాలని బోర్డు సూచించింది.

విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా హాల్ టికెట్లపై QR కోడ్‌ను ముద్రించారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా సెంటర్ లొకేషన్‌ను ఈజీగా తెలుసుకోవచ్చు. విద్యార్థుల సౌకర్యార్థం వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్‌ను బోర్డు పంపనుంది. దీని ద్వారా కూడా విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూసుకోవచ్చు.

ఒకవేళ హాల్ టికెట్‌లో పేరు, ఫోటో, సంతకం లేదా ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే విద్యార్థులు కంగారు పడాల్సిన అవసరం లేదు. వెంటనే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి, వారి ద్వారా బోర్డుకు నివేదించి సరిచేయించుకోవాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే