The Kerala Story 2: సెన్సేషనల్ సినిమాకు సీక్వెల్ వచ్చేసింది
ది కేరళ స్టోరీ 2 ట్రైలర్ భారతీయ సినిమా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. "రాబోయే 25 ఏళ్లలో ఇండియా ఇస్లామిక్ దేశంగా మారుతుంది" వంటి డైలాగ్స్‌తో ఈ సీక్వెల్ లవ్ ట్రాప్స్, మత మార్పిడుల చీకటి కోణాలను వెలికితీస్తుంది. వివాదాస్పద చిత్రాల కోవలో వస్తున్న ఈ సినిమా మధ్యప్రదేశ్, రాజస్థాన్ నేపథ్యంగా ముగ్గురు అమ్మాయిల కథను చూపుతుంది.
రాబోయే 25 ఏళ్లలో ఇండియా పూర్తి ఇస్లామిక్ దేశంగా మారబోతుంది.. త్వరలోనే రాబోయే సెన్సేషనల్ సినిమాలోని డైలాగ్ ఇది. దీన్నిబట్టి వివాదాలకు మనోళ్లు బాగా అలవాటు పడిపోయారని అర్థమైపోతుంది. మూడేళ్ళ కింద ఇండియన్ సినిమాను షేక్ చేసిన ఓ బ్రేకింగ్ సినిమాకు సీక్వెల్ వస్తుందిప్పుడు. ట్రైలర్‌తోనే కావాల్సినంత కాంట్రవర్సీ స్టఫ్ తీసుకొచ్చింది ఆ సినిమా. మరి ఏంటది.. అందులో ఏముంది..? ఇండియన్ సినిమాను కొన్నేళ్లుగా కాంట్రవర్సీ కథలే నడిపిస్తున్నాయి. కొందరు వాటిని ప్రోపగాండా సినిమాలని విమర్శిస్తున్నా.. వివాదాల మధ్యే విడుదలై సంచలనాలు రేపుతున్నాయి. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, రజాకార్, ది బెంగాల్ ఫైల్స్, సబర్మతి రిపోర్ట్ లాంటి సినిమాలు ఫలితాలతో సంబంధం లేకుండా వివాదాలు రేపాయి. తాజాగా కేరళ స్టోరీ 2 వచ్చేస్తుంది. మరింత భయంకరమైన చీకటి కథను వెలుగులోకి తెస్తున్నామని నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా చెప్తున్నారు. షూటింగ్ సమయంలో ఏ ఇబ్బందులు రాకుండా కఠినమైన భద్రతను పాటించామని చెప్పారీయన. రాబోయే 25 ఏళ్లలో భారత్ ముస్లిం దేశంగా మారుతుంది.. వాళ్లు మన కూతుళ్లను టార్గెట్ చేసారు.. మన నమ్మకాన్ని వమ్ము చేసారు లాంటి డైలాగులతో సాగింది ఈ ట్రైలర్. ఫస్ట్ పార్ట్ కేరళలో జరిగితే.. సీక్వెల్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ నేపథ్యంగా సాగుతుంది.. మతమార్పిడి, లవ్ ట్రాప్స్‌తో ముగ్గురమ్మాయిలు ఎలా చితికిపోయారనే లైన్‌తో సీక్వెల్ వస్తుంది. ఉల్కా గుప్తా, ఐశ్వర్య సకూజా, అదితి భాటియా నటిస్తున్న ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకుడు. అబ్ సహేంగే నహీ.. లడేంగే అనే డైలాగ్‌ను హైలైట్ చేసారు మేకర్స్. ఫిబ్రవరి 27న రానుంది కేరళ స్టోరీ 2.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసిలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ రివీల్.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
ఈ దేశం ప్రజలకు 'దోసకాయలు' మరింత ప్రియం..
ట్యాబ్లెట్ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

