AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay- Rashmika Wedding: విజయ్, రష్మిక పెళ్లి సందడి.. ఇద్దరి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా.. ?

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ,రష్మిక మందన్న నుండి వచ్చే ప్రతి పబ్లిక్ అప్పీరెన్స్ , సోషల్ మీడియా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీరి పెళ్లి వార్తలు.. వివాహ ఆహ్వాన పత్రిక నెట్టింట వైరలవుతుంది. దీంతో వీరి పర్సనల్ విషయాలు సైతం వైరలవుతున్నాయి.

Vijay- Rashmika Wedding: విజయ్, రష్మిక పెళ్లి సందడి.. ఇద్దరి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా.. ?
Vijay, Rashmika
Rajitha Chanti
|

Updated on: Feb 19, 2026 | 1:48 PM

Share

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిన విజయ్.. ఆ తర్వాత తనదైన సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్టు, ప్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కొన్నాళ్లుగా హీరోయిన్ రష్మిక తో ప్రేమలో ఉన్నారని.. వీరిద్దరి పెళ్లి ఈనెల 26న జరగనుందని ప్రచారం జరిగింది. అదే సమయంలో వీరి పెళ్లి పత్రిక సైతం వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పటికే విజయ్ ఇంట పెళ్లి పనులు షూరు అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు విజయ్, రష్మిక పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు నెటిజన్స్.

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

విజయ్, రష్మిక ఇద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. వీరిద్దరి జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్స్ లో ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారిందని టాక్. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..నివేదికల ప్రకారం విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ రూ.70 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి జూబ్లీ హిల్స్ లో నివసిస్తున్నారు. విజయ్ గ్యారేజ్‌లో BMW 5 సిరీస్, ఫోర్డ్ ముస్తాంగ్, వోల్వో XC90, రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. సొంతంగా కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ.. అలాగే రౌడీ వేర్ అనే ఫ్యాషన్ సంస్థ సైతం ఉంది. అతను ప్రొఫెషనల్ వాలీబాల్ జట్టు హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌లో ఒక భాగాన్ని కలిగి ఉన్నారు. సినిమాలతోపాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ ద్వారా సంపాదిస్తున్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

ఇక రష్మిక విషయానికి వస్తే.. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.66 కోట్లు ఉన్నట్లు సమాచారం. బెంగళూరులో దాదాపు రూ.8 కోట్ల విలువైన ఇల్లు, ముంబై, గోవా, కూర్గ్, హైదరాబాద్‌లలో సొంతంగా అపార్ట్మెంట్స్ కలిగి ఉంది. రష్మిక తాను పనిచేసే ప్రతి సినిమాకు దాదాపు రూ.4 కోట్లు వసూలు చేస్తుంది. రష్మిక దగ్గర ఆడి క్యూ3, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ వంటి కార్లు ఉన్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది రష్మిక.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us