AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఇల్లు కొనడానికి మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు.. ఎంత వస్తుంది..? నిబంధనలు ఏంటి..?

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది. మీ పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను ఇంటి నిర్మాణానికి వాడుకోవచ్చు. ఇందుకోసం మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏయే డాక్యుమెంట్స్ అవసరం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

EPFO: ఇల్లు కొనడానికి మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు.. ఎంత వస్తుంది..? నిబంధనలు ఏంటి..?
Epfo Rules
Venkatrao Lella
|

Updated on: Feb 19, 2026 | 1:39 PM

Share

సొంత ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల. ఉద్యోగం చేసి సంపాదించిన సొమ్మును ఇంటి నిర్మాణం కోసం పొదుపు చేసుకుంటూ ఉంటారు. ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న నగుదుతో తమ సొంతింటి ఇంటి కలను సాకారం చేసుకుంటారు. మరికొంతమంది తమ ప్లే సిప్ మీద బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. అయితే పీఎఫ్ అకౌంట్‌లో పొదుపు చేసుకున్న సొమ్మును కూడా ఇంటి నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. మీ పీఎఫ్ అకౌంట్లోని నిధులను ఇల్లు కొనుగోలు చేయడానికి లేదా ఇంటిని నిర్మించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.

నిబంధనల్లో మార్పులు

పీఎఫ్ నగదును తీసుకోవాలంటే కారణం ఏంటనేది వెల్లడించాల్సి ఉంటుంది. అందులో భాగంగా మీరు హోమ్ లోన్ తిరిగి చెల్లించడానికి, ఇంటిని పునరుద్ధరించడానికి, కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి, ఇల్లును కొనుగోలు చేయడానికి పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఇందుకోసం ప్రక్రియను మరింత సులభతరం చేశారు. ఉపసంహరణ పరిమితులు, నిబంధనలను సడలించారు. ఈపీఎఫ్‌వో 3.0లో ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ నుంచి వీటిని అమలు చేయనున్నారు.

అర్హతలు ఇవే..

-ఈపీఎఫ్‌వో సభ్యుడు అయి ఉండాలి -యూఏఎన్ యాక్టివ్‌గా ఉండాలి -కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి -ఇల్లు మీ పేరు, మీ జీవిత భాగస్వామి లేదా ఉమ్మడి పేరు మీద ఉండాలి -ఆస్తి యాజమాన్యాన్ని నిరూపించే డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి -ఇల్లు కొనుగోలుకు లేదా నిర్మించేందుకు తీసుకోవాలంటే మూడు నుంచి ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి -ఇక హోమ్ లోన్ చెల్లించడానికి తీసుకోవాలంటే 10 సంవత్సరాల వ్యవధి ఉండాలి

ఎంత డబ్బు తీసుకోవచ్చు

మీ పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తంలో 90 శాతం వరకు తీసుకోవచ్చు. 36 నెలల పాటు మీ బేసిక్ శాలరీ, DA మొత్తాన్ని మించకూడదు. ఈ రెండు మొత్తాలలో తక్కువ మొత్తం మీ PF క్లెయిమ్‌కు జమ చేయబడుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న ఇంటికి మరమ్మత్తులు లేదా పునరుద్ధరించడం కోసం తీసుకోవాలంటే  ఇంటి నిర్మాణం పూర్తై కనీసం ఐదు సంవత్సరాల అయి ఉండాలి. 100 శాతం నగదు తీసుకోవడవానికి అనుమతించరు. ఇక ఫారం 31ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేసి క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లో నగదు మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. డాక్యుమెంట్స్ సరిగ్గా అప్‌లోడ్ చేయకపోయినా, తప్పులు ఉన్నా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. దీంతో సరైన వివరాలు అందించాల్సి ఉంటుంది.

Follow Us