యాలకులను ఇలాచి అని కూడా పిలుస్తారు. భారతీయ వంటలు, డెజర్ట్ లు తయారు చేయడంలో ఎక్కువగా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. మంచి సువాసన, రుచి కలిగి ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
యాలకులను 'క్వీన్ ఆఫ్ స్పైసెస్' అని కూడా పిలుస్తారు. యాలకులు శక్తివంతమైన ఔషధ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని పాలతో కలిపి తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది.
యాలకులలో కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ ఉంటాయి. ఈ పదార్థాలు శరీరానికి మేలు చేస్తాయి. రాత్రిపూట నోటిలో వేసుకుంటే జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి దుర్వాసన వస్తుంది. దీని నుండి బయటపడాలంటే నోటిలో ఏలకులు పెట్టుకుని నిద్రపోవాలి. ఇది నోటి నుండి వచ్చే దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది.
యాలకులలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడానికి పనిచేస్తాయి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు నోటిలో ఉంచుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
యాలకులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే అనేక పోషకాలను కలిగి ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ఏలకులను నోటిలో ఉంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు నోటిలో యాలకులు పెట్టుకుని నిద్రపోతే మంచి ఫలితం ఉంటుంది.. ఇలా చేయడం ద్వారా, మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడం ప్రారంభమవుతుంది.
మంచి నిద్రని ప్రేరేపించడంలో ఇలాంచి సహాయపడుతుంది. అంతేకాదు.. రాత్రివేళ నిద్రపోయే ముందు రెండు యాలకులు నోట్లో వేసుకుని పడుకుంటే.. మీరు ఊహించని లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.