KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ బిగ్ డే.. నందినగర్ ఇంట్లో KCR విచారణ ప్రారంభమైంది. మాజీ CM కేసీఆర్ నుంచి సిట్ ఏ సమాచారం రాబట్టాలనుకుంటోంది.. ఈ కేసులో అరెస్టైన కొందరు అధికారులు విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా ఏయే ప్రశ్నలు అడగబోతోంది.. ఇదే ఇప్పుడు విచారణలో కీలకంగా మారింది.
నందినగర్ ఇంట్లో KCR విచారణ ప్రారంభమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 3 గంటలకు సిట్ విచారణ ప్రారంభమైంది. ఆరుగురు సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. విచారణ సమయంలో కేసీఆర్ వెంట ఒకరు ఉండేందుకు అవకాశం కల్పించారు. కేసీఆర్ వెంట సంతోష్ ఉంటారని సిట్‌కి సమాచారం ఇచ్చింది లీగల్ టీమ్.. న్యాయ సహాయం కోసం అందుబాటులో అడ్వొకేట్ రాంచందర్‌రావు ఉన్నారు. విచారణ సమయంలో KTR ఇంట్లోనే ఉండనున్నారు. కుటుంబ సభ్యుడిగా ఇంట్లో ఉండేందుకు KTRకి అనుమతి ఇచ్చారు. హరీష్‌రావు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అంతా భవన్‌లోనే ఉన్నారు. అప్పటికే నందినగర్ ఇంటికి చేరుకున్న సిట్ అధికారులు.. ఒక గదిలో విచారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
సిట్ విచారణపై ముఖ్యనేతలు, అడ్వొకేట్లతో KCR మీటింగ్ నిర్వహించారు. ఫామ్‌హౌస్ నుంచే అందరికీ భోజనాలు తెప్పించారు. ప్రస్తుతం నందినగర్ నివాసంలో KCRతోపాటు.. కేటీఆర్, హరీష్, ఆర్‌ఎస్ ప్రవీణ్, అడ్వొకేట్ మోహన్‌రావు ఉన్నారు. కేసీఆర్ ఇంటి పరిసరాల్లో ఐదుగురు డీసీపీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

