AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాగున్నారా.. అమ్మ..! రాష్ట్ర మహిళా మంత్రులకు.. మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ పలకరింపు..!

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ కలిశారు. మేడారం జాతరకు రావాలని కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. మేడారం మహా జాతరకు కేసీఆర్‌ను ఆహ్వానించడంతో సానుకూలంగా స్పందించారని సీతక్క తెలిపారు. KCR దంపతులు తమకు చీరలు బహుకరించడం సంతోషంగా ఉందని మంత్రులు సీతక్క, కొండా సురేఖ అన్నారు.

బాగున్నారా.. అమ్మ..! రాష్ట్ర మహిళా మంత్రులకు.. మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ పలకరింపు..!
Kcr, Seethakka, Konda Surekha
Balaraju Goud
|

Updated on: Jan 08, 2026 | 5:40 PM

Share

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ కలిశారు. మేడారం జాతరకు రావాలని కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. మేడారం మహా జాతరకు కేసీఆర్‌ను ఆహ్వానించడంతో సానుకూలంగా స్పందించారని సీతక్క తెలిపారు. KCR దంపతులు తమకు చీరలు బహుకరించడం సంతోషంగా ఉందని మంత్రులు సీతక్క, కొండా సురేఖ అన్నారు.

రాష్ట్ర దేవదాయ ధర్మదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మరికొద్ది రోజుల్లో మొదలు కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్‌ను ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, కేసీఆర్‌కు శాలువా కప్పిన మంత్రులు సీతక్క, సురేఖ ఆహ్వాన పత్రికను అందజేశారు. కేసీఆర్‌కు మేడారం ప్రసాదం అందజేశారు.

ఇంటికి వచ్చిన అతిథులకు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు. అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం అందజేశారు. తన ఇంటికి వచ్చిన రాష్ట్ర మహిళా మంత్రులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా… కేసీఆర్, శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు.

కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆదివాసి బిడ్డలుగా పుట్టిన సమ్మక్క-సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసీ జాతర. ప్రాంతాలకు అతీతంగా అందరి కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క సారాలమ్మలు. మేడారం మహా జాతరకి కేసీఆర్‌ను ఆహ్వానించామని మంత్రులు సీతక్క, సురేఖ తెలిపారు. కాగా … తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సాదర ఆహ్వానం పలికారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..