AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మేడారం సమ్మక్క, సారక్కకు నిలువెత్తు బంగారం సమర్పించిన టాలీవుడ్ నటి.. వీడియో ఇదిగో

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర గా మేడారం సమ్మక్క, సారక్క జాతర మొన్ననే అట్టహాసంగా జరిగింది. ఇక్కడ కొలువైన అమ్మవార్లకు బంగారం (బెల్లం) సమర్పించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నటి కూడా అమ్మవార్లకు నిలువెత్త బంగారం సమర్పించింది.

Tollywood: మేడారం సమ్మక్క, సారక్కకు నిలువెత్తు బంగారం సమర్పించిన టాలీవుడ్ నటి.. వీడియో ఇదిగో
Tollywood Actress Divi Vadthya
Basha Shek
|

Updated on: Feb 09, 2026 | 7:08 PM

Share

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో దివి వైద్య ఒకరు. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన ఆట తీరు, అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకు ముందు మహర్షి లాంటి పలు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లోనూ మెరిసిందీ ముద్దుగుమ్మ. ఇక బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీ రేంజ్ మారిపోయింది. వరుసగా సినిమావకాశాలు సొంతం చేసుకుంది. ఏ 1 ఎక్స్‌ప్రెస్, క్యాబ్‌ స్టోరీస్‌, నయీమ్ డైరీస్, జిన్నా, గాడ్ ఫాదర్, రుద్రంగి, లంబసింగి, పుష్ప 2, డాకు మహారాజ్ తదితర సినిమాల్లో నటించి మెప్పించింది దివి. లేటెస్ట్ గా హనీ అనే ఓ హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ అందాల తార. నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలై విజయవంతంగా రన్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం టీవీ షోస్, సినిమాలతో పాటు బిజీ బిజీగా ఉంటోన్న దివి తాజాగా మేడారం వెళ్లింది. అక్కడ సమ్మక్క సారక్కను దర్చించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను స్వయంగా దివినే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మేడారం సమ్మక్క, సారక్క ఆలయంలో  బిగ్ బాస్ దివి.. వీడియో..

View this post on Instagram

A post shared by Divi (@actordivi)

అమ్మవార్లకు బంగారం (బెల్లం) సమర్పిస్తోన్న దివి.. ఫొటోస్.. ఇదిగో..

View this post on Instagram

A post shared by Divi (@actordivi)

కాగా ఈ మధ్యన వరుసగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తోంది దివి. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకుందీ అందాల తార. స్వామి వారికి మొక్కులు సమర్పించింది. ఇక దివి నటించిన లేటెస్ట్ సినిమా హానీ కి  ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో ఆమె నెగెటివ్ పాత్రలో నటించి మెప్పించింది. సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. ఇప్పుడు ఈ బిగ్ బాస్ బ్యూటీ చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయంలో ..

View this post on Instagram

A post shared by Divi (@actordivi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి