AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా’.. బిగ్ బాస్ శ్రీజ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో దమ్ము శ్రీజ ఒకరు. పేరుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ హౌస్ లో తన దమ్మేంటో చూపించిందీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించింది.

'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'.. బిగ్ బాస్ శ్రీజ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Telugu 9 Fame Srija
Basha Shek
|

Updated on: Feb 08, 2026 | 2:46 PM

Share

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది దమ్ము శ్రీజ. ఆతర్వాత బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ కంటెస్టెంట్ గా నేరుగా హౌస్ లోకి అడుగు పెట్టింది. తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా తన ముక్కుసూటితనం మాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అదే క్రమంలో తన ఓవర్ యాటిట్యూడ్ తో నెగెటివిటీని మూటగట్టుకుంది. దీంతో బిగ్ బాస్ ఫినాలే దాకా ఉంటుందనుకున్న శ్రీజ ఐదో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా మొదటి వారంలోనే మళ్లీ బయటకు వచ్చేసింది. ప్రస్తుతం డ్యాన్స్ రియాలిటీ షో బీబీ జోడీలో పార్టిసిపేట్ చేస్తోన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంది. ఇదే క్రమంలో తనకు కాబోయే లైఫ్ పార్ట్ నర్ ఎలా ఉండాలో కూడా చెప్పుకొచ్చింది.

‘బిగ్‌బాస్‌కు వెళ్లి నాకంటూ ఓ పేరు సంపాదించుకున్నందుకు సంతోషంగా ఉంది. కానీ ప్రేక్షకుల ఓట్ల ద్వారా కాకుండా వైల్డ్‌ కార్డ్స్‌తో గేమ్‌ ఆడించి బయటకు పంపించినందుకు చాలా బాధగా అనిపించింది. నాకే ఎందుకిలా జరుగుతుందని ఏడ్చాను.నేను పార్టీలు, పబ్బులకెళ్తా.. కానీ, మందు మాత్రం తాగను. నాకు కాబోయే భర్త తాగుడుకు బానిసైతే మాత్రం నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా.. ఇంకా నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు మంచి హైట్‌ ఉండాలి. ఒత్తుగా జుట్టుండాలి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలి. రేపు నేను జాబ్ చేసినా, చేయకపోయినా, ఖాళీగా ఉన్నా అతడే అన్నీ చూసుకునేలా ఉండాలి. నాకయితే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. నేనంటే పడి చచ్చిపోయేవాడు కావాలి’ అని కోరుకుంటోంది శ్రీజ.

ఇవి కూడా చదవండి

బీబీ జోడీలో బిగ్ బాస్ శ్రీజ..

View this post on Instagram

A post shared by RJ Chaitu 🎤 (@rjchaitu)

ప్రస్తుతం శ్రీజ కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. శ్రీజకు కాబోయే భర్త   ఎక్కడ దొరుకుతాడో నంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా నెలకు సుమారు రూ. 2లక్షల సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది శ్రీజ.  అయితే ఇప్పుడు మళ్లీ ఆమె ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.

పవన్ పాటకు శ్రీజ డ్యాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర