AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punarnavi Bhupalam: ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్‌బాస్ పునర్నవి.. ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరంటే?

బిగ్‌బాస్ 3 ఫేమ్ పునర్నవి భూపాలం శుభవార్త చెప్పింది. పలు సినిమాలు, టీవీ షోల్లోనూ సందడి చేసిన ఈ నటి త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ఈ అమ్మడి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Punarnavi Bhupalam: ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్‌బాస్ పునర్నవి.. ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరంటే?
Punarnavi Bhupalam
Basha Shek
|

Updated on: Feb 19, 2026 | 8:33 PM

Share

పునర్నవి భూపాలం.. తెలుగు ఆడియెన్స్ కు ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ అందాల తార. ఇందులో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో కనిపించి ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అయితే దీని తర్వాత పునర్నవి చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ద్వారా మరింత పాపులర్ అయ్యిందీ అందాల తార. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన పునర్నవి సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్ తో లవ్‌ ట్రాక్‌ నడిపి బాగా ఫేమస్‌ అయింది. అయితే అది బిగ్ బాష్ షో వరకే పరిమితమైంది. షో ముగిసిన తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారురాహుల్‌- పునర్నవి. ఇక కొన్ని నెలల క్రితం సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పునర్నవి కూడా పెళ్లికి రెడీ అయి పోయింది. ఈ మధ్యే తన ప్రియుడిని పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇరు పెద్దల సమక్షంలో గురువారం (ఫిబ్రవరి19) పునర్నవి – హేమంత్‌ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంగా లగ్నపత్రిక కూడా రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను పునర్నవి నే స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఎంగేజ్మెంట్ వేడుకలో నీలిరంగు చీరలో పునర్నవి ఎంతో అందంగా కనిపించింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ నిశ్చితార్థం వేడుక జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇన్ స్టా స్టోరీస్ లో మాత్రం తను సింగిల్‌గా దిగిన పిక్స్‌ మాత్రమే అభిమానులతో పంచుకుంది.

ఇవి కూడా చదవండి

పునర్నవి ఎంగేజ్మెంట్ ఫొటోస్..

ప్రస్తుతం పునర్నవికి సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ బిగ్ బాస్ బ్యూటీకి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పునర్నవికి కాబోయే వాడి పేరు హేమంత్ వ‌ర్మ‌. ఇతను ఒక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్. అలానే ట్రావెలర్ కూడా. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే ఇది అర్థమవుతుంది. వీరిద్దరూ చాలా రోజులుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Hemanth Varma (@shotbyhevi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రైల్వే ప్రయాణీకులు బిగ్ బంపర్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి..
రైల్వే ప్రయాణీకులు బిగ్ బంపర్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి..
ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్
ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్
అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..
అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..
ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా
ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా
బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై కేంద్రం భారీ ఊరట.. ఇకపై 24 గంటలు
బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై కేంద్రం భారీ ఊరట.. ఇకపై 24 గంటలు
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్..
యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్..
రైళ్ల చివరి బోగీ వెనుక ఉండే 'X' గుర్తు రహస్యమిదే.. ఎవరికీ తెలియదు
రైళ్ల చివరి బోగీ వెనుక ఉండే 'X' గుర్తు రహస్యమిదే.. ఎవరికీ తెలియదు
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..