AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Soniya: మేం చనిపోయాక మా డెడ్ బాడీస్‌ వారికే సొంతం.. బిగ్ బాస్ సోనియా దంపతుల సంచలన నిర్ణయం

సినిమాలు, బిగ్ బాస్ విషయాలు సంగతి పక్కన పెడితే.. సోనియాకు సామాజిక స్పృహ ఎక్కువ. పేదల సహాయార్థం ఓ ఎన్జీవోను కూడా రన్ చేస్తోంది. దీని ద్వారానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా సోనియా తన భర్త యష్ తో కలిసి మరో గొప్ప నిర్ణయం తీసుకుంది.

Bigg Boss Soniya: మేం చనిపోయాక మా డెడ్ బాడీస్‌ వారికే సొంతం.. బిగ్ బాస్ సోనియా దంపతుల సంచలన నిర్ణయం
Bigg Boss Soniya Family
Basha Shek
|

Updated on: Feb 19, 2026 | 9:55 AM

Share

సోనియా ఆకుల.. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఈ బ్యూటీ కూడా ఒకరు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. 2019లో రిలీజైన జార్జి రెడ్డి సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది సోనియా. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఆశా ఎన్ కౌంటర్, కరోనా వైరస్ సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇలా సినిమాలు చేస్తున్న సమయంలోనే సోనియాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఎనిమిదో సీజన్ గా కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన ఆమె తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. అయితే ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వ్యాపారా వేత్త యశ్ ను వివాహం చేసుకున్న సోనియా ఇటీవలే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోన్న సోనియా తన భర్త బిజినెస్ ను చూసుకుంటూ బిజీ బిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే సోనియా-యష్ గత కొన్నేళ్లుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓ ఎన్జీవోను స్థాపించి అవసరమైన వారికి తమ వంతు సాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతులు ఆర్గాన్ డొనేషన్ పై అందరిలో అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా యశ్ సుమారు 450 మంది చేత కళ్లను డొనేట్ చేయించారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో భాగంగా తన గురించి తన ఫ్యామిలీ గురించి మరొక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు సోనియా- యశ్ దంపతులు.. తాను సోనియాతో పాటు తన తల్లిదండ్రులు చనిపోతే మా డెడ్ బాడీలు మా కుటుంబ సభ్యులకు సంబంధం లేదని వాటిని గవర్నమెంట్ హాస్పిటల్ కు రాసిచ్చామని తెలిపారు. ‘ మేము చనిపోయిన తర్వాత మా బాడీ నుంచి ఆర్గాన్స్ తీసుకుని వాటిని ఇతరులకు ఉపయోగిస్తే ఇతరులకు మంచి జీవితాన్ని అందించిన వాళ్లం అవుతాం. అందుకే మా కుటుంబ సభ్యుల డెడ్ బాడీస్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కి రాసిచ్చాం’ అని సోనియా దంపతులు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఇప్పుడు వీరిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా తన ఇంటర్వ్యూ చూసినవారు స్వచ్ఛందంగా ఆర్గాన్ డొనేషన్ కు ముందుకు రావాలంటూ కూడా అందరికీ పిలుపు నిచ్చారు సోనియా- యశ్ దంపతులు

సోనియా- యశ్ దంపతుల లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Soniya Akula (@soniyaakulaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us