AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mancherial Municipal Corporation Election Results: మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం

తెలంగాణలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. మంచిర్యాల, నల్గొండ, మహబూబ్‌నగర్, రామగుండం కార్పొరేషన్లను కాంగ్రెస్ హస్తగతం చేసుకునే దిశగా దూసుకుపోతోంది.

Mancherial Municipal Corporation Election Results: మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం
Congress Wins Mancherial Corporation
Janardhan Veluru
|

Updated on: Feb 13, 2026 | 4:00 PM

Share

తెలంగాణలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వెలువడిన ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ అత్యధిక కార్పొరేషన్ల ను హస్తగతం చేసుకునే అవకాశముంది. మంచిర్యాల కార్పొరేషన్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంచిర్యాలతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.

మంచిర్యాలలోని మొత్తం 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 44 డివిజన్లను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 08, బీజేపీ 04 స్థానాలకు పరిమితం కాగా.. ఇతరులు 04 డివిజన్‌ను సొంతం చేసుకున్నారు.

మరో మూడు కార్పొరేషన్లలో ఇలా..

నల్గొండ కార్పొరేషన్‌లో 48 డివిజన్లలో 45 డివిజన్ల ఫలితాలు వెలువగా.. కాంగ్రెస్ 26 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ 8, బీజేపీ 4 స్థానాలకు పరిమితమయ్యింది. 7 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.

మహబూబ్‌నగర్‌లోని 60 డివిజన్లలో 22 డివిజన్ల ఫలితాలు వెలువడగా.. కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ తలా 4 డివిజన్లు సొంతం చేసుకున్నాయి. ఇతరులు 2 డివిజన్లు సాధించారు.

రామగుండంలోని మొత్తం 60 డివిజన్లలో 53 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ 35 చోట్ల గెలుపొంది స్పష్టమైన మెజార్టీని సాధించింది. బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులు 4 స్థానాలు సొంతం చేసుకున్నారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026 ఫలితాలు..

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన 'బ్లెస్సింగ్'.. కట్‌చేస్తే..
ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన 'బ్లెస్సింగ్'.. కట్‌చేస్తే..
మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి..?
మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి..?
పెయింట్ పాడవకుండా క్రేయాన్స్, మార్కర్ మరకలు మాయం
పెయింట్ పాడవకుండా క్రేయాన్స్, మార్కర్ మరకలు మాయం
కాంగ్రెస్ హవా ..చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి సెన్సేషన్
కాంగ్రెస్ హవా ..చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి సెన్సేషన్
నాతో సౌందర్య స్పెషల్ సాంగ్.. ఆ సినిమా ఏకంగా 365 రోజులు ఆడింది..
నాతో సౌందర్య స్పెషల్ సాంగ్.. ఆ సినిమా ఏకంగా 365 రోజులు ఆడింది..
Mancherial Corporation: మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం
Mancherial Corporation: మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం
పండుగల స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే క్యారెట్ రసమలై..
పండుగల స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే క్యారెట్ రసమలై..
నల్గొండలో కాంగ్రెస్ ప్రభంజనం.. కార్పొరేషన్‌తో పాటు 6 మున్సిపాలిటీ
నల్గొండలో కాంగ్రెస్ ప్రభంజనం.. కార్పొరేషన్‌తో పాటు 6 మున్సిపాలిటీ
నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ హవా.. కార్పొరేషన్ మాత్రం..
నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ హవా.. కార్పొరేషన్ మాత్రం..
హాలీడే ప్లాన్ చేస్తున్నారా? ఈ బీచ్‌లలో వైరస్‌ ముప్పు! ఆరోగ్య శాఖ
హాలీడే ప్లాన్ చేస్తున్నారా? ఈ బీచ్‌లలో వైరస్‌ ముప్పు! ఆరోగ్య శాఖ