తామర పువ్వు చరిత్ర తెలుసా? బురదలో పుట్టినా ఎలా వికసిస్తుందంటే?
samatha
27 November 2026
Pic credit - Pinterest
అందమైన పువ్వులలో తామర పువ్వు ఒకటి. దీని చూస్తే కళ్లు తిప్పుకోలేం. అంత అందంగా ఉంటుంది. ఇది లక్ష్మీదేవికి ప్రీతికరమైన పువ్వు.
తామర పువ్వు
అయితే అన్ని పువ్వులలా ఇది నేలపై పూయదు, నీటిలో బురదలో పూస్తుంది. మరి బురదలో నుంచి వచ్చే పువ్వు అంత అందంగా ఎలా ఉంటుంది అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.
బురదలో పుట్టి వికసించడం
కాగా, ఇప్పుడు మనం అసలు తామర పువ్వు ఎలా వికసిస్తుంది. దాని జీవిత చరిత్ర గురించి మనం వివరంగా తెలుసుకుందాం పదండి.
జీవిత చరిత్ర
తామరపువ్వు బురదలో మొదలై, నీటిపై అందంగా వికసించే ఒక అద్భుతమైన మొక్క. దీని జీవన చక్రం ప్రత్యేకతలతో నిండి ఉంది. తామర గింజ నీటిలోకి చేరి, బురదలో స్థిరపడుతుంది.
ప్రత్యేకమైన జీవిత చక్రం
అనుకూల పరిస్థితుల్లో, గట్టి పెంకు తెరుచుకుని మొలక బయటకు వస్తుంది. ఒకవైపు వేర్లు మట్టిలోకి చొచ్చుకుపోగా, మరోవైపు ఆకుపచ్చని మొలక నీటిని చీల్చుకుంటూ పైకి వస్తుంది.
పెంకు నుంచి మొలక
నీటి ఉపరితలంపై చిన్న ఆకు తేలుతుంది. కాలక్రమేణా, బురదలో దుంపలాంటి కాండం విస్తరించి, పొడవైన కాడలు ఏర్పడతాయి. ఈ కాడల్లోని గాలి మార్గాలు నీటిలో మునిగిన భాగాలకు ప్రాణవాయువును చేర్చుతాయి.
ఆకు.. లోపల దుంప
ఆకులు నీటిపైకి వచ్చి, గొడుగులా విచ్చుకుంటాయి. వీటి ఉపరితలంపై ఉన్న సూక్ష్మ నిర్మాణాల వల్ల నీటి బిందువులు ముత్యాల్లా జారిపోతాయి. దీనినే లోటస్ ఎఫెక్ట్ అంటారు.
గోడుగులా ఆకులు
కొన్ని రోజుల తర్వాత, గులాబీ రంగు మొగ్గ నీటిపైకి వచ్చి, అందమైన పువ్వుగా వికసిస్తుంది. తేనెటీగలు పరాగసంపర్కానికి సహాయపడతాయి. పువ్వు వాడిపోయిన తర్వాత, మధ్యలోని గిన్నెలాంటి భాగంలో గింజలు పక్వమవుతాయి.
గులాబీ లాంటి మొగ్గ
ఇవి మళ్లీ నీటిలోకి జారి, కొత్త జీవిత చక్రానికి నాంది పలుకుతాయి. చైనాలో లభించిన 1300 ఏళ్ల నాటి తామర విత్తనం కూడా మొలకెత్తడం ఈ మొక్క అసాధారణ జీవశక్తికి నిదర్శనం.