చిలుక జోస్యం ఎలా చెబుతుంది? దీని వెనకున్న రహస్యం తెలుసా?
samatha
27 November 2026
Pic credit - Pinterest
తమ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆశ, ఎవరికి ఉండదు. అందుకే చాలా మంది జ్యోతిష్యం ద్వారా తమ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
భవిష్యత్తు
అయితే కొంత మంది పంచాంగం ద్వారా తెలుసుకుంటే, మరికొంత మంది చిలుక జ్యోస్యం చెప్పించుకుంటారు. మరి అసలు చిలుక నిజంగానే జోస్యం చెబుతుందా?
చిలుక జ్యోస్యం
అసలు చిలుక ఎలా జోస్యం చెబుతుంది. దీని వెనకున్న అసలు రహస్యం ఏంటో తెలుసుకోవాలని చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.
చిలుక జ్యోస్యం ఎలా చెబుతుంది
దక్షిణ భారతదేశంలో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాల్లో చిలక జోస్యం ఒకటి. ఒక చిన్న చెక్క పెట్టెలో పచ్చని చిలక ముందు వరసగా పేర్చిన కార్డులో నుంచి ఒక తీస్తే దాని బట్టి జ్యోతిష్యం చెబుతారు.
దక్షిణ భారత దేశం
అయితే, చిలక నిజంగా భవిష్యత్తును చదువుతుందా? అనేది కీలక ప్రశ్న. శాస్త్రీయంగా చెప్పాలంటే, చిలక భవిష్యత్తును తెలుసుకుంటుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
భవిష్యత్తు చదువుతుందా
మనుషులకు భయపడకుండా అలవాటు చేసి, కార్డు తీసుకొచ్చినప్పుడు గింజలతో బహుమతిగా ఇవ్వడం ద్వారా చిలకకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియను పదేపదే చేయడం వల్ల చిలక కార్డును ఎంపిక చేయడం నేర్చుకుంటుంది.
కార్డు తీయడం అలవాటు చేయడం
ఇలా కార్డు తీయడం నేర్చుకున్న చిలకతో .. కార్డు తీయిస్తుంటారు. ఇక అందులో ఉన్నదాని గురించి చెబుతూ జాతకం చెబుతుంటారు. ఇలా చాలా మంది చిలుక జోస్యం చెప్పించుకుంటారు.
జాతకం
అయితే మరి ఇది నిజమేనా అంటే దానిపై శాస్త్రీయమైన ఆధారం ఏమి లేదు. కానీ చిలుకకు మాత్రం కార్డు తీసే శిక్షణ ఇవ్వడం ద్వారా అది తనకు నచ్చిన కార్డును ఎంచుకుంటుంది.