Hyderabad: రూట్‌ మార్చిన హైడ్రా.. పడగొట్టుడే కాదు..! మరింత పటిష్టంగా రంగంలోకి..

హైడ్రా రూటు మార్చింది. ఇకపై కొత్త రూపంలో దర్శనం ఇవ్వబోతుంది. బిల్డింగ్స్ పడగొట్టుడే కాదు.. మరికొన్ని విషయాల్లోనూ తన మార్క్ చూపాలనుకుంటోంది. ఇంతకీ హైడ్రా ఏం చేయబోతుంది.. రంగనాథ్ ముందున్న లక్ష్యాలేంటి?

Hyderabad: రూట్‌ మార్చిన హైడ్రా.. పడగొట్టుడే కాదు..! మరింత పటిష్టంగా రంగంలోకి..
HYDRA Commissioner Ranganath
Follow us
TV9 Telugu

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 09, 2024 | 9:24 PM

ప్రభుత్వ ఆస్తుల రక్షణ, అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతూ..హైదరాబాదే కాదు దేశమంతా మార్మోగిన హైడ్రా కొన్నాళ్లుగా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లింది. తాజాగా న‌గ‌రంలో వ‌ర‌ద‌లు, కారణాలు, తీసుకోవాల్సిన పరిష్కార చర్యలపై అధ్యయనం ప్రారంభించారు హైడ్రా కమిషనర్. బెంగ‌ళూరులో అనుస‌రిస్తున్న విధానాల‌పై చర్చించారు. బెంగళూరుకు చెందిన ప్రకృతి వైప‌రీత్యాల నిర్వహ‌ణ కేంద్రం మాజీ డైరెక్టర్ డా. జీఎస్ శ్రీ‌నివాస్ రెడ్డి,ఇతర అధికారులతో రంగనాథ్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ హైడ్రా కార్యాలయంలో జరిగిన సమావేశంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై ప‌వ‌ర్‌పాయింట్ ప్రజెంటేష‌న్ ఇచ్చారు అధికారులు. బెంగ‌ళూరులో అమ‌ర్చిన సెన్సార్‌ల ప్రయోజ‌నాల‌తో పాటు నాలాల్లో చెత్త పేరుకుపోకుండా చ‌ర్యలు తీసుకోవాలన్నారు.

బెంగ‌ళూరుతో పాటు.. దేశంలోని ఇత‌ర ప‌ట్టణాల్లో అనుస‌రిస్తున్న విధానాల‌ను అధ్యయ‌నం చేసి స‌మ‌న్వయంతో మెరుగైన వ్యవ‌స్థను రూపొందించాలని నిర్ణయించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌. ప్రస్తుతం న‌గ‌రంలో అనుస‌రిస్తున్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విధానాల‌ను మ‌రింత స‌మ‌ర్థవంతంగా, స‌మ‌న్వయం ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, ఇత‌ర కార‌ణాల‌తో భారీ వర్షాలు పడే సమయంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా.. ప్రాంతాల‌వారీగా వెద‌ర్ రిపోర్టు ప్రజల‌కు చేరేలా చ‌ర్యలు తీసుకోవాలన్నారు. గ్రేట‌ర్‌ హైద‌రాబాద్ ప‌రిధిలో డివిజ‌న్ల వారీ వెద‌ర్ స్టేష‌న్ల నుంచి స‌మాచారాన్ని ఎప్పటిక‌ప్పుడు క్రోడీక‌రించి వ‌ర్షపాత న‌మోదు, వ‌ర‌ద ముప్పును అంచ‌నా వేసి ప్రజ‌ల‌కు చేరవేయాలని నిర్ణయించారు. రోడ్లపై వ‌ర్షపు నీరు ప్రవ‌హించ‌కుండా ఎక్కడిక‌క్కడ కాలువ‌ల్లోకి చేరేలా చూడాలని

వరదల సమయంలో ప్రజల్ని అప్రమత్తం చేయడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా హైడ్రానే చూసుకోవాలని నిర్ణయించారు. చెరువులన్నీ అలుగుల ద్వారా గొలుసుకట్టు చెరువులతో వరద సాఫీగా ముందుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు హైడ్రా కమిషనర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA