AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీఆర్‌ఎస్‌ పార్టీ పేరు మారనుందా.. కేటీఆర్‌ మాటలకు అర్థమేంటి.?

తాజాగా కేటీఆర్ చేసిన కామెంట్స్ మళ్లీ పార్టీ పేరును టిఆర్ఎస్‌గా మారుస్తారన్న చర్చకు దారితీసింది. ఇటీవల వచ్చిన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను  ఉద్దేశించి 2029లో ప్రాంతీయ పార్టీలదే దేశవ్యాప్త హవా అంటూ ఆయన కామెంట్ చేశారు. అయితే ఇప్పటికే పేరు మార్చుకొని జాతీయ పార్టీగా ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ ప్రాంతీయ పార్టీలది..

Telangana: బీఆర్‌ఎస్‌ పార్టీ పేరు మారనుందా.. కేటీఆర్‌ మాటలకు అర్థమేంటి.?
BRS Party
Rakesh Reddy Ch
| Edited By: Narender Vaitla|

Updated on: Oct 09, 2024 | 6:16 PM

Share

తెలంగాణ సాధించి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ పేరు మార్చగానే ఓటమిపాలైందనే టాక్ రాష్ట్రమంతా వినిపించింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి వరకు పార్టీ ప్రయాణం గమనిస్తే అదే అర్థమవుతుంది. పేరు మార్చిన తర్వాతే డౌన్ ఫాల్ మొదలైందని కార్యకర్తలు అందరూ చర్చించుకున్నారు. అదే విషయాన్ని బయటకి ఒప్పుకోకపోయినా అధిష్టానం కూడా దాదాపుగా ఏకీభవించింది.

తాజాగా కేటీఆర్ చేసిన కామెంట్స్ మళ్లీ పార్టీ పేరును టిఆర్ఎస్‌గా మారుస్తారన్న చర్చకు దారితీసింది. ఇటీవల వచ్చిన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను  ఉద్దేశించి 2029లో ప్రాంతీయ పార్టీలదే దేశవ్యాప్త హవా అంటూ ఆయన కామెంట్ చేశారు. అయితే ఇప్పటికే పేరు మార్చుకొని జాతీయ పార్టీగా ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ ప్రాంతీయ పార్టీలది హవా అంటూ వ్యాఖ్యానించడం పైన కార్యకర్తలు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు.

ఇంతకీ బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీనా, ప్రాంతీయా పార్టీనా.?

మరోవైపు కార్యకర్తల్లో కచ్చితంగా పేరు మార్పు జరుగుతుందంటూ కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. నిజానికి టెక్నికల్ గా చూస్తే పేరు మార్పు సాధ్యం కాదు. ఇదే విషయాన్ని గతంలో టీవీ9 స్టూడియోలో సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చిన కేసీఆర్ కూడా చెప్పారు. ఒకసారి రాజకీయ పార్టీ పార్టీ పేరు మారాక ఆరు సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ ఆరేళ్లలో మళ్లీ పేరు మార్చడానికి వీలు లేదు. ఇది ఎన్నికల కమిషన్ నిబంధన.

ఒకవేళ ఆరేళ్ల తర్వాత పేరు మార్చుదామనుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అప్పటికి వేరే వ్యక్తులు రిజిస్టర్ చేసుకుంటే మళ్ళీ ఆ పేరు దక్కడం కష్టమే. సో మంచైనా చెడైనా భారత రాష్ట్ర సమితి పేరుతోనే రాజకీయాలు నిర్వహించాలి. కాకపోతే గతంలోలా ఇతర రాష్ట్రాల్లో పాగా వేస్తాం… జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామంటూ భావించిన బిఆర్ఎస్ అధిష్టానం ఇక పూర్తిస్థాయిలో తెలంగాణలోనే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పార్టీ పేరు మారినా.. ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రాంతీయ పార్టీగానే పరిమితమైంది. మొన్నటి ఎన్నికల్లో గెలిచి ఉంటే పక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉండేది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..