Watch: ఇంట్లో పనిమనిషికి ఐఫోన్ బహుమతిగా ఇచ్చిన జంట.. వారి రియాక్షన్ చూడాల్సిందే..!
వారిద్దరూ తమ పనిమనిషికి ఐఫోన్లు తెచ్చి వారికి ఎలాంటి సమాచారం లేకుండా సప్రైజ్ చేశారు. దంపతులు ఆ బహుమతిని తమ కూతురి చేతుల మీదుగా అందించారు. ఇద్దరికీ ఐఫోన్ ఇవ్వటం చూసి వారే నమ్మలేకపోయారు. ఒక్కసారిగా
ఒక జంట తమ ఇంటి పనిమనిషికి ఊహించని బహుమతిని ఇచ్చింది. ఇది తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ అనుకుంటారు.. ఇలాంటి యజమాని మాకూ ఉంటే బాగున్ను అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. వైరల్ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఈ జంటను చాలా మంది ప్రశంసిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. మలేషియా దంపతులు తమ ఇంటి పనిమనిషికి ఖరీదైన ఐఫోన్‌లను బహుమతిగా ఇచ్చారు.
ఏదైనా పండగ, ప్రత్యేకమైన రోజుల్లో ఇంట్లోని పని మనుషులకు కూడా బట్టలు, బహుమతులు ఇవ్వటం చాలా మంది చేస్తుంటారు. అయితే, చాలా మంది స్వీట్లు, ఆహారం, బట్టలు లేదా కొంత డబ్బును బహుమతిగా ఇస్తుంటారు. కానీ, ఒక జంట తమ ఇంట్లో పనిచేసే పనిమనిషికి ఓ ఖరీదైన, ఊహించని బహుమతిని ఇచ్చారు. ఇది ఆ బహుమతి అందుకున్న వారిని ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఒక ఆవిడ మాత్రం సంతోషంతో గట్టిగా ఏడ్చేసింది. ఇది చూసి అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకు ఆ బహుమతి ఏంటో తెలుసుకుందాం..
మలేషియా జంట, జెఫ్ లియోంగ్, అతని భార్య ఇంతిరా కళంజియం వారి యూట్యూబ్ ఛానెల్ జెఫ్ & ఇంతిరాలో వ్లాగ్‌లను షేర్ చేస్తున్నారు. దీనిని 1.2 మిలియన్ల మంది ప్రజలు అనుసరిస్తున్నారు. తమ ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు పనిమనిషులకు ఈ జంట ఐఫోన్‌ను బహుమతిగా ఇచ్చారు. వారిద్దరూ తమ పనిమనిషికి ఐఫోన్లు తెచ్చి వారికి ఎలాంటి సమాచారం లేకుండా సప్రైజ్ చేశారు. దంపతులు ఆ బహుమతిని తమ కూతురి చేతుల మీదుగా అందించారు. ఇద్దరికీ ఐఫోన్ ఇవ్వటం చూసి వారే నమ్మలేకపోయారు. ఒక్కసారిగా ఖరీదైన బహుమతి చూసే సరికి వాళ్లకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇదంతా ఆ జంట వీడియో రికార్డ్ చేసింది. అనంతరం వీడియోను వారు తమ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా షేర్ చేశారు. సెప్టెంబర్ 21న ఈ వీడియోని షేర్ చేశారు.
ఈ మలేషియా దంపతులు తమతో రెండేళ్లుగా జీవిస్తున్న శ్రీ, నేనెంగ్ అనే ఇద్దరు ఇండోనేషియా పనిమనిషిని నియమించుకున్నారు. ఇద్దరూ ఇంటిపని, వంటపని, చిన్న పిల్లలను చూసుకుంటున్నారు. వీడియోలో, ఇద్దరు పనిమనిషికి ఫోన్ ఇవ్వటంతో వారు ఆనందంతో అరుస్తూ,..ఇది నమ్మశక్యంగా లేదని చెప్పారు. ఆ వెంటనే ఆ జంట చెప్పింది..ఇప్పుడు మీరు కేవలం ఇంట్లో పని మనుషులు కాదు.. మీరు మా కుటుంబంలో భాగమయ్యారు అంటూ వారికి భరోసా ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..