Ratan Tata: తీవ్ర విషమంగా రతన్ టాటా ఆరోగ్యం..అత్యవసర స్థితిలో ఐసీయూలో చికిత్స..
రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే దానిపై రతన్ టాటా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తోన్న వదంతులను నమ్మవద్దని ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే తాజాగా వస్తున్న వార్తలపై ఆయన నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు.
పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు వైద్యులు. అయితే, 86 ఏళ్ల రతన్ టాటా ఆరోగ్యంపై టాటా గ్రూప్ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే దానిపై రతన్ టాటా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తోన్న వదంతులను నమ్మవద్దని ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే తాజాగా వస్తున్న వార్తలపై ఆయన నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు.
Ratan Tata, chairman emeritus of India’s Tata conglomerate, in critical condition in hospital, sources say https://t.co/V8bbFAx5jZ pic.twitter.com/qAYOPngGzb
— Reuters (@Reuters) October 9, 2024
రతన్ టాటా ఎంతో ఉదారమైన వ్యక్తి. 86ఏళ్ల రతన్ టాటా 28 డిసెంబర్ 1937న జన్మించారు. విదేశాల్లో చదువు పూర్తయిన తర్వాత రతన్ టాటా మొదట టాటా గ్రూప్ కంపెనీ టాటా ఇండస్ట్రీస్‌లో అసిస్టెంట్‌గా చేరారు. ఆ తర్వాత కొన్ని నెలలపాటు జంషెడ్‌పూర్‌లోని టాటా ప్లాంట్‌లో శిక్షణ తీసుకున్నారు.. శిక్షణ పూర్తయిన తర్వాత, రతన్ టాటా తన బాధ్యతలను నిర్వహించడం ప్రారంభించాడు. మొదట టాటా గ్రూప్‌లో అసిస్టెంట్‌గా చేరారు. రతన్ టాటా..1991 మార్చి నుండి డిసెంబర్ 2012 వరకు టాటా సన్స్ ఛైర్మన్‌గా రతన్ టాటా.. టాటా గ్రూప్‌ను నడిపించారు. 2008లో, రతన్ టాటాను భారత ప్రభుత్వం దేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..