గర్భా కింగ్.. డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన ప్రముఖ కళాకారుడు.. గుండెపోటుతో మృతి.. షాకింగ్‌ వీడియో వైరల్‌

తడికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఈ హృదయ విదారక సంఘటనతో ఆనందోత్సవ వేడుకలపై నీలినీడలు కమ్మేసింది. 'గర్బా కింగ్' అని పిలవబడే గార్బా ట్రైనర్ అశోక్ మాలి ఆకస్మిక మరణంతో దాండియా, గర్బా సంతోషకర వాతావరణం చెదిరిపోయింది. అశోక్‌ మాలీ మరణంతో అక్కడి ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

గర్భా కింగ్.. డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన ప్రముఖ కళాకారుడు.. గుండెపోటుతో మృతి.. షాకింగ్‌ వీడియో వైరల్‌
Garba King
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Oct 12, 2024 | 8:00 PM

నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో వేడుకగా జరుగుతున్నాయి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వేడుకలో పాల్గొంటున్నారు. ప్రతి రోజూ సాయంత్ర వేళ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో గర్భా, దండియా నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. నవరాత్రి ఉత్సవాలు దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న వేళ ఓచోట జరిగిన గర్భా ఉత్సవంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో గర్భా డ్యాన్స్‌ చేస్తూ ఓ కళాకారుడు కుప్పకూలి మృతి చెందాడు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని పూణెలో సోమవారం చోటు చేసుకుంది.

మహారాష్ట్రలోని పూణేలో గర్బా నిర్వహిస్తుండగా ప్రముఖ కళాకారుడు 54ఏళ్ల అశోక్‌ మాలీ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. కార్యక్రమంలో ఓ బాలుడితో కలిసి హుషారుగా గర్బా డ్యాన్స్‌ చేస్తున్న అతడు ఉన్నట్టుండి కూలిపోయాడు. అతడికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఈ హృదయ విదారక సంఘటనతో ఆనందోత్సవ వేడుకలపై నీలినీడలు కమ్మేసింది. ‘గర్బా కింగ్’ అని పిలవబడే గార్బా ట్రైనర్ అశోక్ మాలి ఆకస్మిక మరణంతో దాండియా, గర్బా సంతోషకర వాతావరణం చెదిరిపోయింది. అశోక్‌ మాలీ మరణంతో అక్కడి ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

గర్భా ఆడుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆ వ్యక్తి శారీరక శ్రమ పెరుగుతుంది. ఈ సమయంలో ఆక్సిజన్ అవసరం ఎక్కువవుతుంది. అధిక ఆక్సిజన్ వినియోగం ఊపిరితిత్తుల పనితీరును పెంచుతుంది. ఇది నేరుగా గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. గుండె వేగంగా రక్తాన్ని పంపింగ్ చేయడం ప్రారంభం అవుతుంది. దీంతో గుండె పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..