Viral News: అదృశ్యమైన మహిళ.. సొరచేప కడుపులో అవశేషాలు..! అసలేం జరిగిందంటే..
డైవింగ్ చేస్తున్నప్పుడు బలమైన అలల కారణంగా ఆ మహిళ నీటిలో గల్లంతైంది. మోన్‌ఫోర్ కనిపించకుండా పోవడంతో స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం కొలీన్ మోన్‌ఫోర్ కోసం గాలింపు చేపట్టారు. అలా వారం రోజులు గడిచిపోయింది. గాలింపు సాగుతునే ఉంది. చివరకు..
ప్రతిరోజూ ఏదో ఒక చోట మనిషి మిస్సింగ్ కేసు నమోదవుతూనే ఉన్నాయి. తప్పిపోతున్న వ్యక్తుల కోసం పోలీసులు, కుటుంబీకులు గాలింపు కొనసాగిస్తూనే ఉంటారు. అలాంటి మిస్సింగ్ కేసులో కనిపించకుండా పోయిన మహిళ ఆచూకీ ఊహించని విధంగా గుర్తించారు. ఈ ఘటన తెలిసిన ప్రతి ఒక్కరినీ షాక్ అయ్యేలా చేసింది. గత నెల 26న (సెప్టెంబర్ 26) స్నేహితులతో కలిసి వాటర్ డైవింగ్ చేసేందుకు వెళ్లిన మహిళ అదృశ్యమైంది. మహిళ కనిపించకుండా పోవడంతో ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎలాంటి సమాచారం అందలేదు. చివరకు సొరచేప కడుపులోంచి ఆమె అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కొలీన్ మోన్‌ఫోర్ అనే 68ఏళ్ల అమెరికన్ మహిళ తన స్నేహితులతో కలిసి ఇండోనేషియా తీరానికి వెళ్లింది. డైవింగ్ చేస్తున్నప్పుడు బలమైన అలల కారణంగా ఆ మహిళ నీటిలో గల్లంతైంది. మోన్‌ఫోర్ కనిపించకుండా పోవడంతో స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం కొలీన్ మోన్‌ఫోర్ కోసం గాలింపు చేపట్టారు. అలా వారం రోజులు గడిచిపోయింది. గాలింపు సాగుతునే ఉంది. చివరకు ఆమె అవశేషాలు సొరచేప కడుపులో లభించాయి.
తైమూర్-లెస్టేలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ భారీ సొరచేప చిక్కింది. పట్టుబడిన సొరచేపలో మానవ అవశేషాలు గుర్తించారు. ఇందులో స్విమ్‌సూట్ కూడా ఉండటం గమనించారు. డైవింగ్ చేసేటప్పుడు కొలీన్ మోన్‌ఫోర్ ధరించింది అదే డ్రెస్ అని తెలిసింది. దీంతో అధికారులు ఇండోనేషియా కోస్ట్ గార్డ్‌ను సంప్రదించి తప్పిపోయిన కొలిన్ మోన్‌ఫోర్ బంధువులు, స్నేహితుల నుంచి సమాచారం సేకరించారు. ఈ మేరకు సొరచేప కడుపులోంచి ఆమె అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ, అయితే, అధికారులు దీనిని ధృవీకరించలేదు. విచారణ కొనసాగుతోందని సమాచారం.
ఇదిలా ఉంటే..ఈ ఘటనపై కొలిన్ మోన్ ఫోర్ స్నేహితురాలు ఒకరు ఫేస్‌బుక్ చేసిన పోస్ట్ కొత్త ట్విస్ట్‌కు దారితీసింది. షార్క్ కడుపులో దొరిన అవశేషాలు తన స్నేహితురాలివి కావంటూ.. ఈ వాదనలన్నీ అబద్ధమని పేర్కొంది. తన స్నేహితురాలు కొలీన్ మోన్‌ఫియోర్ షార్క్ దాడిలో చనిపోయిందంటే.. తాను నమ్మడం లేదని కిమ్ తన పోస్ట్‌లో పేర్కొంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..