AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Work From Wedding: వామ్మో..ఇదెక్కడి కర్మరా సామీ..! పెళ్లి మండపంలో ల్యాప్‌టాప్ పట్టుకుని వర్క్ చేసిన వరుడు..

వైరల్ పోస్ట్ లో వరుడు తన పెళ్లిలో కూడా ల్యాప్‌టాప్‌తో కుస్తీ పడుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. వివాహ వేడుకలో ఎంతో సంతోషంగా గడపాల్సిన సమయంలో వరుడు చేస్తున్న పనికి అక్కడున్న వారు కూడా షాక్‌ అయ్యారు. ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Work From Wedding: వామ్మో..ఇదెక్కడి కర్మరా సామీ..! పెళ్లి మండపంలో ల్యాప్‌టాప్ పట్టుకుని వర్క్ చేసిన వరుడు..
Techie Groom
Jyothi Gadda
|

Updated on: Oct 08, 2024 | 7:09 PM

Share

Viral Video: సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు తరచూగా వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాము. పెళ్ళిలో జరిగే వింత సంఘటనలకు సంబంధించి అనేక వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇదే కోవకు చెందిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ పోస్ట్ లో వరుడు తన పెళ్లిలో కూడా ల్యాప్‌టాప్‌తో కుస్తీ పడుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. వివాహ వేడుకలో ఎంతో సంతోషంగా గడపాల్సిన సమయంలో వరుడు చేస్తున్న పనికి అక్కడున్న వారు కూడా షాక్‌ అయ్యారు. ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన క్షణం. ఆ పెళ్లి క్షణాల కోసం వధూవరులు ఎన్నో కలలు కంటారు. పెళ్లి క్షణాలను చిరకాలం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బయట ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా పెళ్లిరోజుకు అవన్నీ పక్కన పెట్టేస్తారు..పెళ్లికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కానీ, ఇక్కడో వరుడు మండపం కంటే ల్యాప్‌టాప్‌కే ఎక్కువ ప్రముఖ్యతనిచ్చాడు.. అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బిజీ లైఫ్‌, పని ఒత్తిడి కారణంగా మనిషి అనేక ఇబ్బందులు పడుతున్నాడు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కుదేలవుతున్నాడు. ఇలాంటి తరుణంలో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ ఫోటో..మరింత ప్రకంపనలు సృష్టించింది. AI స్టార్టప్ ‘థాట్లీ’ సహ వ్యవస్థాపకుడు కాసే మాక్రెల్ స్వయంగా తన పెళ్లిలోనే ఇలా ల్యాప్‌టాప్‌పై పని చేస్తున్నప్పుడు ఎవరో తీసిన ఫోటో ఇది..ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతను చేసిన ఈ పనికి నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. తనకు ఎందుకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ కూడా కొందరు వ్యాఖ్యనించారు.

ఇవి కూడా చదవండి

Techie Groom

ఈ ఫోటోను అతని సహ వ్యవస్థాపకుడు టోరే లియోనార్డ్ లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. పని చేసే అలవాటు వ్యసనంగా చేసుకున్న మాక్రెల్ పెళ్లి రోజు కూడా ఆపలేదని లియోనార్డ్ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ఇటీవల కొత్త ప్రాజెక్ట్‌ని తీసుకున్నారని, రాబోయే రెండు వారాల్లో దాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కానీ, దురదృష్టవశాత్తు మాకేరెల్ వివాహం కూడా అదే రెండు వారాల వ్యవధిలో జరిగిందని ఫోటోకు వివరణ ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..