AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: కిటికీలోంచి దూరి.. సఫారీ బస్సుపై చిరుత దాడి..! భయానక వీడియో వైరల్‌

వైరల్‌ వీడియోలో చిరుతపులిని చూసి పర్యాటకులు భయంతో కేకలు వేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. చిరుతపులి కిటికీకి వేలాడుతూ బస్సులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అయితే సఫారీల సమయంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని బన్నెరఘట్ట బయోలాజికల్ పార్క్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో

Watch: కిటికీలోంచి దూరి.. సఫారీ బస్సుపై చిరుత దాడి..!  భయానక వీడియో వైరల్‌
Leopard Tries To Enter Safari Bus
Jyothi Gadda
|

Updated on: Oct 08, 2024 | 5:57 PM

Share

అడవిలో జంతువులను దగ్గరగా చూసేందుకు చాలా మంది జంగిల్‌ సఫారీకి వెళ్తుంటారు. అయితే, అలా వెళ్లిన కొందరు పర్యాటకులకు ఊహించని అనుభవం ఎదురైంది. సఫారీ కోసం బయలుదేరిన మినీ బస్సులోకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ చిరుత పర్యాటకుల్ని భయంతో వణికించి చంపేసింది. ఈ షాకింగ్‌ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ ఘటన ఆదివారం సాయంత్రం కర్ణాటకలోని బన్నెరఘట్ట బయోలాజికల్ పార్కులో చోటుచేసుకుంది. ఈ ఘటనను బస్సులో ప్రయాణిస్తున్న పలువురు తమ కెమెరాల్లో బంధించారు. వీడియోలో చిరుతపులి బస్సు కిటికీలోంచి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది.

వైరల్‌ వీడియోలో చిరుతపులిని చూసి పర్యాటకులు భయంతో కేకలు వేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. చిరుతపులి కిటికీకి వేలాడుతూ బస్సులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అయితే సఫారీల సమయంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని బన్నెరఘట్ట బయోలాజికల్ పార్క్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. బన్నెరఘట్ట బయోలాజికల్ పార్క్ డిప్యూటీ కన్జర్వేటర్ మీడియాతో మాట్లాడుతూ.. కొన్నిసార్లు చిరుతపులులు సఫారీ వాహనాలపై దూకుడు వైఖరిని అవలంబిస్తాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

నిపుణులు ప్రకారం, ఇది జంతువుల సహజ ప్రవర్తన అని నిపుణులు అంటున్నారు. జంగిల్‌ సఫారీలో తరచూ కార్లు, జీపులు, ఇతర వాహనాలను జంతువులు వెంబడిస్తుంటాయని చెప్పారు. జంతువులు చురుకుగా ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..