పంటపొలంలో ప్రత్యక్షమైన అరుదైన తాబేలు..20 కిలోల బరువు, ప్రత్యేకమైన..

ఈ తాబేలు నదీ ప్రవాహంలో కొట్టుకువచ్చి పంట పొలాల్లోకి చేరినట్టుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వటంతో తాబేలును సురక్షితంగా తిరిగి నదిలోకి వదిలారు. అయితే, ఈ తాబేలు ప్రత్యేకత ఏంటంటే.. ఇది మెత్తటి షెల్ కలిగి ఉండి..

పంటపొలంలో ప్రత్యక్షమైన అరుదైన తాబేలు..20 కిలోల బరువు, ప్రత్యేకమైన..
Rare Tortoise
Follow us

|

Updated on: Oct 08, 2024 | 7:01 PM

బీహార్‌లోని బగాహాలో 20 కిలోల బరువున్న భారీ అరుదైన తాబేలు ప్రత్యక్షమైంది. ఈ అరుదైన తాబేలును చూసేందుకు గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బగాహాలోని వాల్మీకి పులుల అభయారణ్యంలోని పిప్రా కుటీ ప్రాంతంలో సుమారు 20 కిలోల బరువున్న అరుదైన తాబేలు కనిపించింది. వింతగా కనిపించిన తాబేలును చూసిన స్థానికులు వెంటనే దాన్ని ఓ సంచిలో బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తాబేలును సురక్షితంగా రక్షించారు.

Rare Tortoise

ఆ తర్వాత తాబేలును సురక్షితంగా గండక్ నదిలోకి వదిలారు అటవీ అధికారులు. ఈ తాబేలు నదీ ప్రవాహంలో కొట్టుకువచ్చి పంట పొలాల్లోకి చేరినట్టుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వటంతో తాబేలును సురక్షితంగా తిరిగి నదిలోకి వదిలారు. అయితే, ఈ తాబేలు ప్రత్యేకత ఏంటంటే.. ఇది మెత్తటి షెల్ కలిగి ఉన్న అరుదైన జాతికి చెందినదిగా కనిపిస్తోందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అయితే, దీని షెల్‌ సున్నితంగా ఉండటం వెనుక కారణాలపై పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..