ఈ వోడ్కా భారతదేశంలోనే నెం.1.. మ్యాజిక్‌ ఫ్లేవర్, టేస్ట్ అదుర్స్.. ధర ఎంతంటే..?

వోడ్కా చాలా ప్రజాదరణ పొందిన మద్య పానీయం. కానీ దీనికి శాస్త్రీయ అధ్యయనాల నుండి ఎటువంటి వివరణ లేదు. కానీ, వోడ్కా ప్రియులు మాత్రం ఇది మంచిదని చెబుతున్నారు. ఇతర ఆల్కహాల్‌లు బరువును పెంచుతాయని, వోడ్కా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుందనే భయం లేదని చెబుతున్నారు. తక్కువ క్యాలరీలు

ఈ వోడ్కా భారతదేశంలోనే నెం.1.. మ్యాజిక్‌ ఫ్లేవర్, టేస్ట్ అదుర్స్.. ధర ఎంతంటే..?
Vodka Brand Number 1
Follow us

|

Updated on: Oct 08, 2024 | 3:50 PM

మద్యం ఆరోగ్యానికి హానికరం. ఈ మాటలు ప్రతి మద్యం బాటిల్‌పైనా తప్పక రాసి వుంటుంది. అంతేకాదు..మద్యం బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే, ఎందరో తమ ఆస్తులను, చేస్తున్న పనులను కోల్పోతున్నారు. అయినప్పటికీ మద్యం విక్రయాల్లో ఎలాంటి తగ్గుదల లేదు. మార్కెట్లోకి కొత్త కొత్త బ్రాండ్‌లతో నయా నయా మాల్స్ మందుబాబులకు అందుబాటులోకి వస్తున్నాయి. అనేక బ్రాండ్లు అమ్మకాల రికార్డులను నెలకొల్పాయి. నంబర్ 1గా మారాయి. మద్యం రకాలలో వోడ్కా చాలా మందికి ఇష్టమైన డ్రింక్‌. వోడ్కాను.. కాక్‌టెయిల్‌లతో సహా అనేక విధాలుగా కూడా ఉపయోగిస్తుంటారు మద్యం ప్రియులు, అమ్మకందారులు. కానీ, మన దేశంలో వోడ్కాకు ఇతర మద్యానికి ఉన్నంత ప్రాధాన్యత లేదు. చాలా తక్కువ. అందులోనూ భారతదేశంలో అమ్ముడవుతున్న నంబర్ 1 వోడ్కా బ్రాండ్ మ్యాజిక్ మూమెంట్స్ గురించి చాలా మందికి తెలియదు.

స్మిర్నోఫ్, రోమనోవ్, బెల్వెడెరే వంటి అనేక వోడ్కా పేర్లు ప్రసిద్ధి చెందాయి. కానీ, అత్యధికంగా అమ్ముడవుతున్న మ్యాజిక్ మూమెంట్స్ బాగా ఫేమస్‌ అయింది. 750ml Magic Moments వోడ్కా ధర రూ.800 మాత్రమే. ఇతర వోడ్కాలతో పోలిస్తే దీని ధర తక్కువ. వోడ్కా గ్రీన్ యాపిల్, ఆరెంజ్, చాక్లెట్, లెమన్‌గ్రాస్, అల్లం, రాస్ప్‌బెర్రీ, వెనిలా, కాన్‌బెర్రీ వంటి అనేక రుచులలో లభిస్తుంది. మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా 2006లో ప్రారంభించబడింది. ఆ తరువాత, ఇది నిరంతరం అమ్మకాలలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. 2024 నాటికి ఈ బ్రాండ్ భారతదేశంలో మ్యాజిక్ చేసింది. గణాంకాల ప్రకారం, 2024 నాటికి, మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా సీసాల 6 మిలియన్ కేసులు ఇప్పటివరకు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఆదాయం దాదాపు రూ.1000 కోట్లు అని సమాచారం.

వోడ్కా చాలా ప్రజాదరణ పొందిన మద్య పానీయం. కానీ దీనికి శాస్త్రీయ అధ్యయనాల నుండి ఎటువంటి వివరణ లేదు. కానీ, వోడ్కా ప్రియులు మాత్రం ఇది మంచిదని చెబుతున్నారు. ఇతర ఆల్కహాల్‌లు బరువును పెంచుతాయని, వోడ్కా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుందనే భయం లేదని చెబుతున్నారు. తక్కువ క్యాలరీలు కలిగిన వోడ్కాలో కార్బోహైడ్రేట్ కంటెంట్, చక్కెర, కొవ్వు పదార్థాలు ఉండవని చెబుతున్నారు. ఇది బరువు పెరగడాన్ని నిరోధిస్తుందని వోడ్కా ప్రియులు వాదిస్తున్నారు. అయితే, ఆల్కహాల్ ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిది కాదని మర్చిపోకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ వోడ్కా భారతదేశంలోనే నెం.1.. మ్యాజిక్‌ ఫ్లేవర్, టేస్ట్ అదుర్స్.!
ఈ వోడ్కా భారతదేశంలోనే నెం.1.. మ్యాజిక్‌ ఫ్లేవర్, టేస్ట్ అదుర్స్.!
బంగారంపై రుణాల్లో మోసం! ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
బంగారంపై రుణాల్లో మోసం! ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
మార్కెట్‌లోకి నిస్సాన్ నయా కారు ఎంట్రీ..!
మార్కెట్‌లోకి నిస్సాన్ నయా కారు ఎంట్రీ..!
అతిపెద్ద 3D-ప్రింటెడ్ భవనం ప్రారంభం..ఎక్కడో తెలుసా?
అతిపెద్ద 3D-ప్రింటెడ్ భవనం ప్రారంభం..ఎక్కడో తెలుసా?
ఆరోగ్య బీమా క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ముఖ్య కారణాలు ఇవే!
ఆరోగ్య బీమా క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ముఖ్య కారణాలు ఇవే!
ఐపీఓ బాటలో హ్యూందాయ్ మోటర్స్.. జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు
ఐపీఓ బాటలో హ్యూందాయ్ మోటర్స్.. జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు
5 ఓవర్లు, ఓవర్‌కి 8 బంతులు.. మరెన్నో వింత రూల్స్‌.. బరిలోకి భారత్
5 ఓవర్లు, ఓవర్‌కి 8 బంతులు.. మరెన్నో వింత రూల్స్‌.. బరిలోకి భారత్
ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈ అబ్బాయి.. ఇప్పుడు స్టార్ హీరో..
ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈ అబ్బాయి.. ఇప్పుడు స్టార్ హీరో..
ఈ నీరు అమృతం కన్నా ఎక్కువే.. డయాబెటిస్‌కు దివ్యౌషధం..
ఈ నీరు అమృతం కన్నా ఎక్కువే.. డయాబెటిస్‌కు దివ్యౌషధం..
ఈ ఆఫర్ మిస్ చేసుకోకండి.. సగం కన్నా తక్కువ ధరకే టాప్ స్మార్ట్ టీవీ
ఈ ఆఫర్ మిస్ చేసుకోకండి.. సగం కన్నా తక్కువ ధరకే టాప్ స్మార్ట్ టీవీ