బాబోయ్ ఎంత దారుణం.. విద్యుత్ తీగ తెగి పడి మహిళ స్పాట్ డెడ్.. షాకింగ్ వీడియో చూస్తే గుండె గుభేల్
సదరు మహిళ ఇంటి దగ్గర నిలబడి ఉండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినప్పుడు మంజమ్మ రోడ్డు పక్కన నిలబడి మరో ఇద్దరు మహిళలతో మాట్లాడుతోందని తెలిసింది. ఈ క్రమంలోనే ఊహించని విధంగా..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దంచికొడుతున్న వానలకు పాత ఇళ్లు, భవనాలు కూలిపోతున్నాయి. భారీ వృక్షాలు కూడా నేలకూలుతున్నాయి. అక్కడక్కడ కరెంట్ స్తంబాలు కూడా కూలిపోతున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యుత్ వైర్లు తెగిపడుతున్న ఘటనలు కూడా అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనూ కర్ణాటకలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరు దక్షిణ తాలూకాలోని చిక్కనహళ్లి గ్రామంలో వర్షాల కారణంగా విద్యుత్ వైరు తెగి పడి ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు బెంగళూరులోని చిక్కనహళ్లి గ్రామానికి చెందిన మంజమ్మ(50)గా గుర్తించారు. సదరు మహిళ ఇంటి దగ్గర నిలబడి ఉండగా ఒక్కసారిగా విద్యుత్ తీగ తెగి పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినప్పుడు మంజమ్మ రోడ్డు పక్కన నిలబడి మరో ఇద్దరు మహిళలతో మాట్లాడుతోందని తెలిసింది. ఈ క్రమంలోనే ఊహించని విధంగా విద్యుత్ వైర్ తెగిపడింది. మిగతా ఇద్దరు తృటిలో తప్పించుకోగా, మంజమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మొత్తం పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డైంది. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజరాజేశ్వరి ఆసుపత్రికి తరలించారు.
A tragic incident occurred in Tavarakere, Bengaluru, where a 55-year-old woman was electrocuted to death after a live electric wire snapped and fell on her. This devastating event has shocked the local community and raised serious concerns about the safety and maintenance of… pic.twitter.com/MCxYd8Kd2N
— Karnataka Portfolio (@karnatakaportf) October 7, 2024
ఈ మేరకు బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ లిమిటెడ్ పై భారతీయ న్యాయ సంహిత సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..