AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Jobs: ‘వచ్చే మార్చిలోపు ఎస్‌బీఐలో 10వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం..’ ఎస్బీఐ ఛైర్మన్‌

దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాని సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి, సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడానికి సుమారు 10,000 మంది కొత్త ఉద్యోగులను నియమించాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్తగా నియమించుకోనున్నట్లు సంస్థ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులుశెట్టి తెలిపారు...

SBI Jobs: 'వచ్చే మార్చిలోపు ఎస్‌బీఐలో 10వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం..' ఎస్బీఐ ఛైర్మన్‌
State Bank Of India
Srilakshmi C
|

Updated on: Oct 08, 2024 | 6:32 AM

Share

దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాని సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి, సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడానికి సుమారు 10,000 మంది కొత్త ఉద్యోగులను నియమించాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్తగా నియమించుకోనున్నట్లు సంస్థ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులుశెట్టి తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మా వర్క్‌ఫోర్స్‌ను టెక్నాలజీ వైపు అలాగే సాధారణ బ్యాంకింగ్ వైపు పటిష్టం చేస్తున్నాం. ప్రవేశ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు వివిధ విభాగాల్లో దాదాపు 1,500 మంది టెక్నాలజీ పర్సన్స్‌ రిక్రూట్‌మెంట్‌లను ఇటీవల చేపట్టాం. అందులో డేటా సైంటిస్ట్‌లు, డేటా ఆర్కిటెక్ట్‌లు, నెట్‌వర్క్ ఆపరేటర్లు మొదలైన ప్రత్యేక ఉద్యోగాలు కూడా మా టెక్నాలజీ రిక్రూట్‌మెంట్‌లో ఉన్నాయి.

సాంకేతికంగా వివిధ రకాల ఉద్యోగాల కోసం వారిని వినియోగించుకుంటున్నాం. ప్రస్తుత సంవత్సరం అవసరాలకు దాదాపు 8000 మంది ఉద్యోగుల అవసరం ఉంది. ప్రత్యేక, సాధారణ విభాగాలకు కలిపి మొత్తం పది వేల మంది కొత్త ఉద్యోగుల అవసరం ఉంది. మార్చి 2024 నాటికి ఎస్బీఐ మొత్తం సిబ్బంది సంఖ్య 2,32,296కు చేరుకుంటుంది. ఇందులో 1,10,116 మంది అధికారులు గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వివిధ బ్యాంచుల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఎప్పటికప్పుడు మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచుకునే ప్రక్రియ ఎప్పటికప్పుడు కొనసాగుతోందని ఎస్‌బీఐ చీఫ్‌ వెల్లడించారు. మరోవైపు మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖలు ఉన్నాయని, కొత్తగా మరో 600 శాఖలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

కస్టమర్ అంచనాలు మారుతున్నాయి. సాంకేతికత మారుతోంది. డిజిటలైజేషన్ విస్తృతంగా వినియోగంలోకి వస్తుంది. కాబట్టి, మేము మా ఉద్యోగులను అన్ని స్థాయిలలో నిరంతరం రీస్కిల్ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా, కస్టమర్ల పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి, ఉన్నతమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి బ్యాంక్ నిర్దిష్టమైన ప్రత్యేక నైపుణ్యాలను అందిస్తుంది. నెట్‌వర్క్ విస్తరణ విషయానికి వస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 600 శాఖలను ప్రారంభించాలని ఎస్‌బీఐ యోచిస్తోందని ఆయన తెలిపారు. SBIలో మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖల నెట్‌వర్క్‌లు ఉన్నాయి. బ్రాంచ్ నెట్‌వర్క్ కాకుండా, 65 వేల ATMలు, 85 వేల వ్యాపార కరస్పాండెంట్ల ద్వారా కస్టమర్లకు సేవలందిస్తున్నాం. ఇక ప్రస్తుతం సుమారు 50 కోట్ల మంది కస్టమర్లకు సేవలందిస్తున్నట్లు ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులుశెట్టి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us