AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్తే.. ఏకంగా పెళ్లి చేసేశారు!

పిల్లలు తెలిసీ తెలియక చేసిన తప్పులను పెద్దలు సరిదిద్దవల్సింది పోయి.. దగ్గరుండి మరో తప్పు చేయించారు. ఓ యువకుడు ప్రేమ పేరుతో అర్ధరాత్రి బాలిక ఇంటికెళ్లాడు. రహస్యంగా బాలికను కలిసే ప్రయత్నం చేయగా.. బంధువులు సదరు యువకుడిని దొరకబుచ్చుకుని బాలిక మెడలో తాళి..

Andhra Pradesh: అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్తే.. ఏకంగా పెళ్లి చేసేశారు!
Marriage With Minor Girl
Srilakshmi C
|

Updated on: Oct 07, 2024 | 9:04 AM

Share

కృష్ణా, అక్టోబర్‌ 7: పిల్లలు తెలిసీ తెలియక చేసిన తప్పులను పెద్దలు సరిదిద్దవల్సింది పోయి.. దగ్గరుండి మరో తప్పు చేయించారు. ఓ యువకుడు ప్రేమ పేరుతో అర్ధరాత్రి బాలిక ఇంటికెళ్లాడు. రహస్యంగా బాలికను కలిసే ప్రయత్నం చేయగా.. బంధువులు సదరు యువకుడిని దొరకబుచ్చుకుని బాలిక మెడలో తాళి కంట్టించారు. ఈ షాకింగ్‌ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..

కృష్ణా జిల్లా గన్నవరం మండల పరిధిలోని ఓ బాలిక (17)కు తల్లి లేదు. దీంతో మేనత్త వద్ద ఉంటోంది. సమీపంలోని సూరంపల్లి గ్రామానికి చెందిన గుర్రం శ్రీకాంత్‌ అనే యువకుడు గత కొంతకాలంగా బాలికను ప్రేమిస్తున్నానంటూ ఆమె చుట్టూ తిరగసాగాడు. ఈ క్రమంలో పలుమార్లు బాలిక ఇంటికి కూడా రావడం ప్రాంరభించాడు. ఇలా శ్రీకాంత్‌ తరచూ బాలిక ఇంటికి రావడాన్ని చుట్టుపక్కల వారు గమనిస్తున్నారు. శనివారం రాత్రి మరోమారు బాలిక ఇంటికి వచ్చిన యువకుడిని బంధువులు అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం యువకుడిని తాళ్లతో బంధించారు. తక్షణమే బాలికను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు.

అయితే తమవి వేర్వేరు కులాలు కావడంతో శ్రీకాంత్‌ తల్లిదండ్రులు ఆ పెళ్లికి నిరాకరించారు. ఊరి పెద్దలు మాత్రం తాళి కట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. దీంతో చేసేదిలేక ఆ పెద్దల సమక్షంలోనే శ్రీకాంత్‌ బాలికకు తాళి కట్టించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిపించారు. మైనర్‌ బాలికకు వివాహం జరిపించడం చట్టరిత్యా నేరం అని ఇరు వర్గాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం విజయవాడ కృష్ణలంకకు చెందిన ఐసీడీఎస్‌ ఉజ్వల హోమ్‌కు బాలికను తరలించారు. ప్రతినిధులు సీఐ శివప్రసాద్‌ నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతానికి పోలీస్‌ స్టేషన్‌లో ఎలాంటి కేసు నమోదు కాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.