ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా.!

ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా.!

Anil kumar poka

|

Updated on: Oct 07, 2024 | 10:56 AM

సాధారణంగా మనుషులకు కవల పిల్లలు జన్మించడం మనకు తెలుసు. ఇక జంతువుల్లో అయితే మేకలు, పులులు ఇలా కొన్ని రకాల జంతువులకు ఒకటికన్నా ఎక్కువ పిల్లలు పుట్టడం సహజం. కానీ ఆవులు, గేదెలు మాత్రం ఒకసారి ఒక్క దూడకు మాత్రమే జన్మనిస్తాయి. కానీ ఇటీవల ఇవి కూడా కవల దూడలకు జన్మనిస్తున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ ఆవు రెండు దూడలకు జన్మనిచ్చింది.

సాధారణంగా మనుషులకు కవల పిల్లలు జన్మించడం మనకు తెలుసు. ఇక జంతువుల్లో అయితే మేకలు, పులులు ఇలా కొన్ని రకాల జంతువులకు ఒకటికన్నా ఎక్కువ పిల్లలు పుట్టడం సహజం. కానీ ఆవులు, గేదెలు మాత్రం ఒకసారి ఒక్క దూడకు మాత్రమే జన్మనిస్తాయి. కానీ ఇటీవల ఇవి కూడా కవల దూడలకు జన్మనిస్తున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ ఆవు రెండు దూడలకు జన్మనిచ్చింది. ఈ విచిత్ర ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. కవల దూడలను చూసేందుకు చుట్టుపక్కలవారు ఆ రైతు ఇంటికి క్యూ కట్టారు.

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక లో అబ్బాయి అనే రైతుకు చెందిన ఆవు సోమవారం కవలదూడలకు జన్మనిచ్చింది. దూడలు రెండూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆవుకు కృత్రిమ గర్భధారణ పద్దతిని ఎంచుకుంటారు. ఇలాంటి సందర్భాలలోనే ఆవుకు ఒకే ఈతలో కవల దూడలు జన్మించడం జరుగుతూ ఉంటుంది. సహజంగా గర్భం దాల్చిన ఆవులు కవలలకు జన్మనివ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. కవల దూడల్లో ఒకటి కోడెదూడ, ఇంకోటి పెయ్యదూడ కావడంతో రైతు సంతోషపడ్డాడు. ఇలా అరుదుగా జరుగుతుందని పశు వైద్యాధికారి తెలిపారు. ఒకేసారి రెండు అండాలు విడుదలైనప్పుడు లేదా ఒక అండం రెండుగా విభజన చెందిన తరువాత ఫలదీకరణ జరిగితే కవల దూడలు జన్మిస్తాయని, దేశవాళీ ఆవులు కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాతి దూడలకు జన్మనిస్తున్నాయని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.