Poison: కన్నోళ్లు ప్రేమను కాదన్నారనీ.. ప్రియుడితో కలిసి సొంత కుటుంబంలో 13 మందిన చంపిన కుమార్తె

ప్రేమించిన అమ్మాయినో, అబ్బాయినో దక్కించుకోవడానికి తాము చస్తామని బెదిరించే వాళ్లను మనం ఇప్పటి వరకూ చూశాం. మరీ కుదరదంటే ఇంట్లో వాళ్లు నిద్రపోయాక ఏ ఆర్ధరాత్రో గోడ దూకేసి పారిపోయే వాళ్లను కూడా చూశాం. కానీ ఈ జంట మాత్రం అందుకు భిన్నంగా మరో అడుగు ముందుకేసి ఇంట్లో అందరినీ హతమార్చారు. తమ ప్రేమను ఇంట్లో అంగీకరించడం లేదన్న అక్కసుతో ఓ యువతి ప్రియుడితో కలిసి భోజనంలో విషం కలిసి తన సొంతింటి వాళ్లందరినీ..

Poison: కన్నోళ్లు ప్రేమను కాదన్నారనీ.. ప్రియుడితో కలిసి సొంత కుటుంబంలో 13 మందిన చంపిన కుమార్తె
Girl Kills 13 Members Of Her Family
Follow us

|

Updated on: Oct 07, 2024 | 11:07 AM

సింధ్, అక్టోబర్‌ 7: ప్రేమించిన అమ్మాయినో, అబ్బాయినో దక్కించుకోవడానికి తాము చస్తామని బెదిరించే వాళ్లను మనం ఇప్పటి వరకూ చూశాం. మరీ కుదరదంటే ఇంట్లో వాళ్లు నిద్రపోయాక ఏ ఆర్ధరాత్రో గోడ దూకేసి పారిపోయే వాళ్లను కూడా చూశాం. కానీ ఈ జంట మాత్రం అందుకు భిన్నంగా మరో అడుగు ముందుకేసి ఇంట్లో అందరినీ హతమార్చారు. తమ ప్రేమను ఇంట్లో అంగీకరించడం లేదన్న అక్కసుతో ఓ యువతి ప్రియుడితో కలిసి భోజనంలో విషం కలిసి తన సొంతింటి వాళ్లందరినీ చంపేసింది. ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగులోకి వచ్చింది. తన ప్రేమ కోసం తన కుటుంబంలో 13 మందిని చంపిన యువతిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళ్తే..

పాకిస్థాన్‌లోని ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఒకే కుటుంబంలో 13 మంది మరణాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. సొంత కుమార్తె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదనీ ఆగ్రహించిన సదరు యవతి కుటుంబం మొత్తాన్ని లేపేసేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. దీంతో తల్లిదండ్రులతో సహా కుటుంబంలోని అందరి చావును చూడాలనుకుంది. రాత్రి భోజనంలో విషం కలపి, ఇంట్లో అందరికీ వడ్డించింది. ఆ ఆహారం తిన్న తర్వాత కుటుంబ సభ్యులందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ 13 మంది మృతి చెందారు.

పోస్ట్‌మార్టం నివేదికలో వారు విషపూరిత ఆహారం కారణంగా మరణించినట్లు తేలిందని ఖైర్‌పూర్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఇనాయత్ షా తెలిపారు. పోలీసుల విచారణలో మృతుల సొంత కూతురు, ఆమె ప్రియుడు కలిసి ఇంట్లో రోటీలు చేయడానికి ఉపయోగించే గోధుమపిండిలో విషం కలిపినట్లు తేలిందని తెలిపారు. దీంతో పోలీసులు ఆదివారం ఆమెను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.