AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MBBS Student: కాలేజీ క్యాంపస్‌లో MBBS విద్యార్ధి అనుమానాస్పద మృతి.. హాస్టల్ గది వెనుక రక్తపుమడుగులో బాడీ లభ్యం

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ కేసు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. నెలలు గడుస్తున్న ఈ కేసులో దోషులను పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో మరో వైద్య విద్యార్ధి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. షాజహాన్‌పూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం..

MBBS Student: కాలేజీ క్యాంపస్‌లో MBBS విద్యార్ధి అనుమానాస్పద మృతి.. హాస్టల్ గది వెనుక రక్తపుమడుగులో బాడీ లభ్యం
Medical Student Found Dead
Srilakshmi C
|

Updated on: Oct 07, 2024 | 10:25 AM

Share

షాజహాన్‌పూర్‌, అక్టోబర్‌ 7: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ కేసు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. నెలలు గడుస్తున్న ఈ కేసులో దోషులను పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో మరో వైద్య విద్యార్ధి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. షాజహాన్‌పూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో క్యాంపస్‌లో శవమై కనిపించాడు. ఈ సంఘటన ఆదివారం (అక్టోబర్‌ 6) ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

విద్యార్థిని వరుణ్ అర్జున్ మెడికల్ కాలేజీకి చెందిన కుషాగ్ర ప్రతాప్ సింగ్ (24)గా గుర్తించారు. గోరఖ్‌పూర్‌కు చెందిన కుషాగ్ర ప్రతాప్‌ మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌ MBBS సెకండ్ ఇయర్‌ చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదుగానీ ఆదివారం తెల్లవారు జామున అతని మృతదేహం హాస్టల్ వెనుక రక్తపు మడుగులో పడి ఉండటం తోటి విద్యార్ధులు గుర్తించారు. వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించినట్లు కల్నల్ (రిటైర్డ్) డాక్టర్ రవీంద్ర నాథ్ శుక్లా మీడియాకు తెలిపారు.

మూడు అంతస్తుల భవనంలో ఉన్న హాస్టల్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో విద్యార్థి ఉంటున్నాడు. ప్రాథమికంగా చూస్తే అతను తనంతట తాను పడిపోయినట్లు లేదా ఎవరైనా అతన్ని నెట్టివేసినట్లు కనిపిస్తోందని పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ ఎస్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కుషాల్‌ హాస్టల్‌ గదిని అధికారులు సీల్‌ చేశారు. విచారణలో భాగంగా తోటి విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కూడా ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, స్థానికులతో మాట్లాడి మరిన్ని వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ యష్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.