AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Street Food: ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి నెల ఆదాయం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే.. సోషల్‌ మీడియాలో వైరల్‌

కొన్ని నగరాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌కు భలే డిమాండ్‌ ఉంటుంది. రోడ్ల పక్కన ఏర్పాటు చేసుకునే ఈ ఫుడ్‌ వ్యాపారులకు సంపాదన భారీగానే ఉంటుంది. కొందరి స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారుల నెల ఆదాయం ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు. ముంబయిలో ఓ వ్యక్తి రోడ్డు పక్కనే వడ పావ్ విక్రయిస్తూ ఏడాదికి..

Street Food: ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి నెల ఆదాయం ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే.. సోషల్‌ మీడియాలో వైరల్‌
Street Food
Subhash Goud
|

Updated on: Oct 07, 2024 | 12:24 PM

Share

కొన్ని నగరాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌కు భలే డిమాండ్‌ ఉంటుంది. రోడ్ల పక్కన ఏర్పాటు చేసుకునే ఈ ఫుడ్‌ వ్యాపారులకు సంపాదన భారీగానే ఉంటుంది. కొందరి స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారుల నెల ఆదాయం ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు. ముంబయిలో ఓ వ్యక్తి రోడ్డు పక్కనే వడ పావ్ విక్రయిస్తూ ఏడాదికి రూ.24 లక్షలు సంపాదిస్తున్నాడు. అతని అద్భుతమైన సంపాదన గురించి వింటే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోను1 కోటి మంది వీక్షించారు

వైరల్ వీడియో ద్వారా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోకి దాదాపు కోటి వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో వడ పావ్ అమ్మే ఈ వీధి వ్యాపారి వార్షిక ఆదాయం రూ. 24 లక్షలు అని తెలుస్తోంది.ఈ వీధి వ్యాపారి నెలవారీ సంపాదన దాదాపు రూ.2.8 లక్షలు. ఇందులో నెలకు దాదాపు రూ.80 వేలు ఖర్చు చేస్తున్నాడు. దీని తర్వాత నెలకు దాదాపు రూ.2 లక్షలు ఆదా చేస్తున్నాడు. అతని సంపాదన విని జనాలు షాక్ అవుతున్నారు. ఈ వీడియో వీధి వ్యాపారుల సంపాదనను బట్టబయలు చేసింది. దీంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా ఇంత ఆదాయం రావడం లేదని, ఈ బిజినెస్‌ బాగుందని ఈ వీడియో చూసిన వారు ఎవరికి వారు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రోజువారీ సంపాదన రూ.9300

రోజువారీ సంపాదన రూ. 9300. నెలవారీ రూ. 2.8 లక్షలు. ముంబైతో పాటు మొత్తం మహారాష్ట్రలో వడ పావ్‌కు ఎంతో క్రేజ్ ఉంది. ఈ స్ట్రీట్ ఫుడ్‌ని ప్రజలు చాలా ఇష్టపడతారు. వీడియోలో వడ పావ్ విక్రేత ఉదయం 200 వడా పావ్‌లను విక్రయించినట్లు చెప్పారు. సాయంత్రం నాటికి ఈ సంఖ్య 622కి చేరుకుంది. ఒక వడా పావ్‌ను రూ.15కు విక్రయిస్తున్నాడు. ఈ విధంగా అతని రోజువారీ ఆదాయం దాదాపు రూ.9300 అవుతుంది. మొత్తం నెలలో చూస్తే, అతని నెలవారీ ఆదాయం రూ.2.8 లక్షల వరకు ఉంటుంది.