SIM Card Block: 1.7 కోట్ల సిమ్‌ కార్డులను బ్లాక్‌ చేసిన కేంద్రం.. మీది కూడా బ్లాక్‌ అవుతుందా? తెలుసుకోండిలా!

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్ కార్డ్ వినియోగదారులపై ప్రభుత్వం పెద్ద చర్య తీసుకుంది. ఈ టెలికాం ఆపరేటర్ల 1.7 కోట్ల సిమ్ కార్డులను ప్రభుత్వం బ్లాక్ చేసింది. నకిలీ ఆధార్ కార్డులు, ఇతర పత్రాల ద్వారా ఈ సిమ్ కార్డులు జారీ అయ్యాయని, నకిలీ పత్రాలు ఇచ్చి జారీ చేసిన సిమ్..

SIM Card Block: 1.7 కోట్ల సిమ్‌ కార్డులను బ్లాక్‌ చేసిన కేంద్రం.. మీది కూడా బ్లాక్‌ అవుతుందా? తెలుసుకోండిలా!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 07, 2024 | 11:53 AM

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్ కార్డ్ వినియోగదారులపై ప్రభుత్వం పెద్ద చర్య తీసుకుంది. ఈ టెలికాం ఆపరేటర్ల 1.7 కోట్ల సిమ్ కార్డులను ప్రభుత్వం బ్లాక్ చేసింది. నకిలీ ఆధార్ కార్డులు, ఇతర పత్రాల ద్వారా ఈ సిమ్ కార్డులు జారీ అయ్యాయని, నకిలీ పత్రాలు ఇచ్చి జారీ చేసిన సిమ్ కార్డులను బ్లాక్‌ చేసింది. మీ సిమ్‌ కార్డ్ వేరొకరి గుర్తింపు పత్రంతో జారీ అయితే సిమ్‌ కార్డు బ్లాక్‌ అవుతుందని గుర్తించుకోండి. సైబర్‌ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. స్పామ్ కాల్‌లను ఆపడానికి ప్రభుత్వం ఇటువంటి నకిలీ సిమ్ కార్డులను బ్లాక్‌ చేస్తోంది.

AI సహాయంతో సిమ్‌ కార్డులు బ్లాక్:

నకిలీ పత్రాలతో కొనుగోలు చేసిన 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో బ్లాక్ చేసింది కేంద్రం. అదనంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT)తో కలిసి పనిచేస్తున్న నలుగురు టెలికాం సర్వీస్ ఆపరేటర్లు (TSPలు) 45 లక్షల నకిలీ అంతర్జాతీయ కాల్‌లను టెలికాం నెట్‌వర్క్‌కు చేరకుండా నిరోధించారు.

11 లక్షల ఖాతాలు

దాదాపు 11 లక్షల ఖాతాలను బ్యాంకులు, పేమెంట్ వాలెట్లు స్తంభింపజేసినట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని సిమ్ కార్డులు బ్లాక్ అవుతాయని ప్రభుత్వం చెబుతోంది.

మీ సిమ్ కార్డ్ ఎవరి ఆధార్ కార్డ్‌లో జారీ అయ్యిందో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ దశలను అనుసరించవచ్చు.

1. ముందుగా tafcop.sancharsaathi.gov.in కు వెళ్లండి

2. ఇక్కడ మీరు మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

3. దీని తర్వాత మీరు OTPని అందుకుంటారు. దానిని నమోదు చేయండి.

4. అప్పుడు మీరు మీ పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులు తీసుకున్నారో పూర్తి సమాచారం తెలిసిపోతుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి