BSNL New Feature: బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో ముందడుగు.. స్పామ్‌ కాల్స్‌ను అరికట్టేందుకు కొత్త ఫీచర్‌.. ఫిర్యాదు చేయండిలా!

జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాల రీఛార్జ్ ప్లాన్‌లను పెంచిన తర్వాత వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులు ఇతర కంపెనీల సిమ్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌లను అందిస్తోంది..

BSNL New Feature: బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో ముందడుగు.. స్పామ్‌ కాల్స్‌ను అరికట్టేందుకు కొత్త ఫీచర్‌.. ఫిర్యాదు చేయండిలా!
Bsnl
Follow us
Subhash Goud

|

Updated on: Oct 07, 2024 | 11:22 AM

జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాల రీఛార్జ్ ప్లాన్‌లను పెంచిన తర్వాత వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులు ఇతర కంపెనీల సిమ్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌లను అందిస్తోంది. అదే సమయంలో కంపెనీ వినియోగదారుల కోసం నిరంతరం కొత్త ప్లాన్‌లను కూడా తీసుకువస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G నెట్‌వర్క్‌పై నిరంతరం పని చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని అనేక ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ కనెక్టివిటీ అందుబాటులోకి రావచ్చు. ఇటీవల ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. స్పీమ్‌ కాల్‌లను నివారించేందుకు చర్యలు చేపట్టగా, ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ముందుకు వచ్చింది. స్పామ్ కాల్‌లను నివారించడానికి కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. స్పామ్ కాల్‌లను నివారించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ చర్యలు చేపట్టింది. మీరు మీ బీఎస్‌ఎన్‌ఎల్‌ నంబర్‌కు వచ్చే స్పామ్ సందేశాల గురించి వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదులను బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌కేర్ యాప్‌ ద్వారా చేయవచ్చు.

Bsnl1

1. ముందుగా మీ ఫోన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌కేర్ యాప్‌ని ఓపెన్‌ చేయండి.

2. ఇప్పుడు మీరు స్క్రీన్ ఎగువ ఎడమ మూలలో ఉన్న మూడు లైన్ల చిహ్నంపై క్లిక్ చేయాలి.

3. దీని తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేయాలి. ఫిర్యాదుకు సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

4. ఆపై కుడి వైపున ఉన్న మూడు-లైన్ మెనుపై నొక్కండి.

5. ఇప్పుడు మీరు కొత్త ఫిర్యాదుపై క్లిక్ చేయాలి.

6. దీని తర్వాత మీరు ఎస్‌ఎంఎస్‌ లేదా వాయిస్ కాల్ మధ్య ఎంపికను ఎంచుకోవాలి. ఆపై పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

7. చివరగా వివరాలను నమోదు చేసిన తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.

Bsnl2

యాప్ సహాయంతో ఫిర్యాదు చేయవచ్చు

కంపెనీ సెల్ఫ్‌కేర్ యాప్ సహాయంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు సులభంగా ఫిర్యాదులు చేయవచ్చు. ప్రస్తుతం ఇలాంటి సదుపాయం మరే కంపెనీకి లేదు. మీరు Selfcare యాప్ సహాయంతో స్పామ్ సందేశాలను నివారించవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్