RG Kar case: కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార ఘటనలో కీలక పరిణామం

కోల్‌కతా హత్యాచార ఘటనపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. బాధితురాలని నిందితుడు సంజయ్‌రాయ్‌ రేప్‌ చేసి చంపేశాడని , గ్యాంగ్‌రేప్‌ జరగలేదని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

RG Kar case: కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార ఘటనలో కీలక పరిణామం
Sanjoy Roy
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 07, 2024 | 9:56 PM

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార ఘటనపై ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. నిందితుడు సంజయ్‌రాయ్‌ ఒక్కడే లేడీ డాక్టర్‌పై అత్యాచారం చేసి చంపేశాడని ఛార్ఝ్‌షీట్‌లో పేర్కొన్నారు. 200 మంది సాక్ష్యులను విచారించినట్టు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. బాధితురాలిపై గ్యాంగ్‌రేప్‌ జరగలేదని సీబీఐ స్పష్టం చేసింది. సెమినార్‌ హాల్లో లేడీ డాక్టర్‌ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అఘాయిత్యానికి పాల్పడినట్టు , అత్యాచారం చేసి చంపేసినట్టు నిందితుడు నేరాన్ని అంగీకరించాడని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

ఆగస్ట్‌ 9వ తేదీన కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో లేడీ డాక్టర్‌పై హత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ కేసులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా ? అన్న విషయంపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు సీబీఐ వెల్లడించింది. సంఘటనా స్థలంలో సంజయ్‌రాయ్‌కు సంబంధించి బ్లూటూత్‌ దొరికింది. దీని ఆధారంగా అతడే నేరం చేసినట్టు గుర్తించారు. అభయ హత్యాచార కేసులో ఆగస్ట్‌ 13వ తేదీన సీబీఐకి అప్పగించారు. కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో డాక్టర్‌ హత్యాచార ఘటన తరువాత ఆధారులు చెరిపేసేందుకు కూడా కుట్ర జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఆర్‌జికర్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌రాయ్‌ను కూడా సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఆస్పత్రిలో నిధుల గోల్‌మాల్‌ విషయంలో ఆయనపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్