200 ఏళ్ల నాటి శాపం.. ఇక్కడ మగవాళ్లు చీరలు కట్టుకుని గర్భా, దాండియా ఆడాల్సిందే..!

పురుషులు దీనిని స్త్రీల పట్ల మర్యాద, గౌరవానికి చిహ్నంగా చూస్తారు. నమ్మకాల ప్రకారం, షెరీ గర్బా చేయడం వల్ల వ్యాపారంలో పురోగతి, మంచి ఆరోగ్యం, ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడం వంటి అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గర్బా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

200 ఏళ్ల నాటి శాపం.. ఇక్కడ మగవాళ్లు చీరలు కట్టుకుని గర్భా, దాండియా ఆడాల్సిందే..!
Men Wear Sarees
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 08, 2024 | 3:08 PM

దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రులలో దుర్గాపూజతో పాటు దాండియా, గర్బా నృత్యాలు జోరుగా నిర్వహిస్తారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమదైన రీతిలో పండుగను జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా నవరాత్రులంటే ముందుగా గుర్తుకు వచ్చేది గుజరాతీ గర్బా. ప్రతి సంవత్సరం నవరాత్రి తొమ్మిది రోజులలో గర్బా జరుగుతుంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ రంగులమయంగా మారుతుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ పండుగలో పాల్గొంటారు. గర్బాలో అందంగా డ్యాన్స్‌లు చేస్తారు.. అయితే గుజరాత్‌లోని ఓ గ్రామంలో మాత్రం గర్భా మరింత ప్రత్యేకం..ఎందుకంటే..ఇక్కడ పురుషులు చీరలు కట్టుకుని, ఆడవాళ్ళలా అందంగా తయారై గర్బా డ్యాన్స్ చేస్తారు.

ఈ ప్రత్యేక గర్బా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని షాపూర్ ప్రాంతంలోని సాధు మాత గలి, అంబా మాత ఆలయంలో జరుగుతుంది. ఇక్కడ, నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆండ్రీ అష్టమి రాత్రి, పురుషులందరూ స్త్రీల వేషధారణతో చీరలు కట్టుకుని, ఉత్సాహంతో గర్బా నృత్యం చేస్తారు. ఈ సంఘంలో దాదాపు 1000 మంది ఉన్నారు. వీరంతా ఆడవాళ్ల వేషంలో గుడిలో, వీధుల్లో గర్బా నృత్యం చేస్తారు.

200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం: పురుషులు, మహిళల దుస్తులు, చీరలు ధరించి గర్బా ఆడే సంప్రదాయం సుమారు 200 ఏళ్లుగా కొనసాగుతోందని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. మగవారు ఇలా చీరలు కట్టుకుని గర్భలో పాల్గొనడం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉందంటున్నారు. బారోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులను సదుబెన్ అనే మహిళ శపించిందని,ఆమె శాప విమోచనానికి గర్బా ప్రాయశ్చిత్తంగా నిర్వహిస్తారని చెబుతున్నారు.. ఈ కథ మొఘలులు భారతదేశాన్ని పరిపాలించిన కాలానికి సంబంధించినది. మొఘలుల దుష్ట దృష్టి సాదుబెన్ అనే మహిళపై పడింది. మొఘల్ రాజు ఆమెను తనతో పాటు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. మొఘలుల నుండి తనను తాను రక్షించుకోవడానికి సదుబెన్ బారోట్ కమ్యూనిటీ సహాయం కోరింది. దురదృష్టవశాత్తు బారోట్ కమ్యూనిటీ పురుషులు ఆమెను మొఘలుల చేతుల నుండి రక్షించలేదు. దీంతో ఆమె బిడ్డ మృతి చెందింది. కోపోద్రిక్తుడైన సదుబెన్ బారోట్ కమ్యూనిటీ పురుషులను శపించిందని చెబుతున్నారు.. భావి తరాలు పిరికిపందలుగా మారతాయని శపించిందట. ఆ తరువాత ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన తర్వాత బారోట్ వర్గీయుల్లో భయం నెలకొంది. సదుబెన్‌ ఆత్మను ప్రసన్నం చేసుకోవడానికి, శాప విముక్తి కోసం ఆమె పేరిట అహ్మదాబాద్‌లో ఆలయాన్ని నిర్మించారు. అలాగే ఈ శాప విముక్తి కోసం నవరాత్రులలో చీర కట్టుకుని గర్బా ఆడతారు. దీనిని షెరీ గర్బా అంటారు. ఈ సంప్రదాయాన్ని చూసేందుకు పట్టణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. సాధారణంగా స్త్రీల దుస్తులు ధరించే పురుషులను చిన్నచూపు చూస్తారు. కానీ బారోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు దీనిని స్త్రీల పట్ల మర్యాద, గౌరవానికి చిహ్నంగా చూస్తారు. నమ్మకాల ప్రకారం, షెరీ గర్బా చేయడం వల్ల వ్యాపారంలో పురోగతి, మంచి ఆరోగ్యం, ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడం వంటి అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గర్బా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే